Lifestyle and Habbits: బాలీవుడ్ నటీనటుల అలవాట్లు, అభిరుచులు..తెలిస్తే నోరెళ్లబెడతారు
Lifestyle and Habbits: సెలెబ్రిటీల జీవనశైలిపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. ఒక్కొక్క అభిరుచి. కొందరికి కొన్ని మేనరిజాలు. ఇంకొన్ని అలవాట్లు. బాలీవుడ్ నటీనటుల్లో ఎవరి అభిరుచి ఎలా ఉందో లెట్స్ హ్యావ్ ఎ లుక్..
Lifestyle and Habbits: సెలెబ్రిటీల జీవనశైలిపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. ఒక్కొక్క అభిరుచి. కొందరికి కొన్ని మేనరిజాలు. ఇంకొన్ని అలవాట్లు. బాలీవుడ్ నటీనటుల్లో ఎవరి అభిరుచి ఎలా ఉందో లెట్స్ హ్యావ్ ఎ లుక్..
సెలెబ్రిటీల్లో ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన నటీ నటుల జీవనశైలి కావచ్చు..అభిరుచులు కావచ్చు, అలవాట్లు కావచ్చు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కొందరిది భిన్నమైన శైలి ఉంటుంది. ఇంకొందరి అలవాట్లు ఆశ్చర్యం కల్గిస్తుంటాయి. మరి కొందరివి నేర్చుకోవాలన్పిస్తుంటాయి. అలాంటి కొందరు సెలెబ్రిటీల అలవాట్లు, లైఫ్‌స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ గురించి చెప్పుకోవాలి. ఇతడికి వేటంటే చాలా ఇష్టం. ఆ వేటలో పడే కోర్టు కేసులు ఎదుర్కొన్నాడు. అది కాకుండా మరో అలవాటు కూడా ఉందట. ఎక్కడికి వెళ్లినా..కొత్తగా ఏదైనా సబ్బు కన్పిస్తే వెంటనే బ్యాగ్‌లో వేసుకుంటాడట. సోప్ కలెక్షన్ అతని అలవాటు. ఆ సోప్స్‌తోనే బాత్రూమ్ ప్రయోగాలు కూడా చేస్తాడని బాలీవుడ్ వీధుల్లో టాక్. ఇది మంచి అలవాటా కాదా అనేది అభిమానులే చెప్పాలి మరి.
ఇక రెండవది విద్యాబాలన్. ఈమెకు చీరలంటే మహా పిచ్చి. కొత్త రంగు, కొత్త డిజైన్ చీర ఏది కన్పించినా కొనేవరకూ నిద్రపోదు. తన క్లాజెట్‌లో యాడ్ అవ్వాల్సిందే. నిద్రపోయేటప్పుడు సైతం చీరలోనే ఉంటుందని అంటారు కొందరు. అదే సమయంలో ఆమెకు ఓ మంచి అలవాటు కూడా ఉంది. సెల్ ఫోన్ చాలా తక్కువగా ఉపయోగిస్తుంది. ఎవరైనా ఏదైనా అత్యవసర మెస్సేజ్ పెడితే అంతే సంగతులు. ఒక్కోసారి వారాల తరబడి ఫోన్ చూడదని సమాచారం. సెల్ ఫోన్ కంటే నేరుగా మాట్లాడటంలోనే ఆమె ఇష్టపడుతుందట. అదీ కారణం మరి.
ఇక బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్. బచ్చన్‌కు కూలీ సినిమాలో ప్రాణాంతక ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయన కుడిచేతికి గాయమైంది. అంతే దానికి విరుగుడుగా ఎడమ చేత్తో రాయడం అలవాటు చేసుకున్నారు. ఎంతగా అంటే కుడిచేత్తో ఎంత వేగంగా రాయగలరో..ఎడమ చేత్తో కూడా అంతే వేగంగా రాయగలరు. నిజంగా గ్రేట్ కదూ..
ఇక మరో బాలీవుడ్ నటుడు క్రికెటర్ పటౌడీ కుమారుడైన సైఫ్ అలీఖాన్. అయ్యగారికైతే బాత్రూమ్‌లో పుస్తకాలు చదివే అలవాటుంది. వార్తాపత్రికలు కాదు. ఇది ఈయనకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అందుకే ఏకంగా బాత్రూమ్‌లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. వింతగా లేదూ..కానీ పుస్తకాలు చదివే అలవాటు మంచిదే మరి.
ఇక ఈయన భార్య కరీనా కపూర్‌కు మరో వింత అలవాటుంది. కంగారు పడినప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు గోర్లు కొరికే అలవాటు. టెన్షన్ నుంచి తట్టుకునేందుకు ఆమెకు గోర్లు కొరకడం అలవాటు. ఈ అలవాటు నూటికి 60 మందికి కచ్చితంగా ఉంటుంది.
Also read: Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి