Gadar 2 OTT Release Date: ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన చిత్రాల్లో గదర్ 2(Gadar 2 Movie) ఒకటి. సీనియర్ హీరో సన్ని డియోల్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా హిందీలో కళ్లుచెదిరే కలెక్షన్స్ సాధించింది. ఈ సంవత్సరం వరుస డిజాస్టర్లతో అల్లాడుతున్న బీటౌన్‏కు పఠాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లు వసూళ్లు సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్ లో గదర్ 2 చిత్రాన్ని రూపొంచారు మేకర్స్. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సన్ని డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లగా నటించారు. 2001లో వచ్చిన గదర్ సినిమాలోనూ వీరే లీడ్ రోల్స్ చేశారు. ఇందులో తారాసింగ్ తన కుటుంబం, తన దేశం కోసం తారా సింగ్ శత్రువులతో పోరాడటాన్ని అద్భుతంగా చూపించారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గదర్2 ఊహించని స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో ఇద ఒకటిగా నిలిచింది. 


తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రానుందని జీ5 సంస్థ ప్రకటించింది. ఈ మూవీని 4కే క్వాలిటీలో స్ట్రీమింగ్ చేయనున్నారుట. గదర్ 2 సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో గదర్ 3 కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్నీ డియోల్ ఈ విషయాన్ని ధృవీకరించినా.. ఎప్పటి నుంచి మొదలవుతుందన్నది మాత్రం చెప్పలేదు. 


Also Read: Jawan Collection Day 6: రూ. 600 కోట్లకు చేరువలో 'జవాన్​'.. ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook