Bajrang Dal activist stopped Alia Bhatt and Ranbir Kapoor at Mahakaleshwar Temple: బాలీవుడ్ కపుల్స్ ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ తొలిసారి జంటగా నటించిన సినిమా 'బ్ర‌హ్మ‌స్త్ర‌'. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుండగా.. తొలి భాగం ‘శివ’ పేరుతో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నారు. బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా సెప్టెంబ‌ర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొద్ది రోజులుగా ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌.. నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఈ జంటకు చేదు అనుభవం ఎదురైంది. గుడిలోకి వెళ్లిన ర‌ణ్‌బీర్-ఆలియాను కొందరు అడ్డుకున్నారు. బీఫ్ తినే విషయంలో ఈ జంట గతంలో చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఇద్దరినీ ఆలయంలోకి అనుమతించేది లేదని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారట. 


తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని ఆలియా భట్‌ గతంలో చెప్పిన ఓ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మటన్, చికెన్‌తో పాటు బీఫ్ కూడా తింటానని ర‌ణ్‌బీర్ కపూర్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో ఉజ్జయిని అమ్మవారిని నేడు దర్శనం చేసుకునేందుకు వచ్చిన అలియా, రణ్‌బీర్‌లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్‌ 'బ్రహ్మాస్త్ర' అంటూ నిరసనలు చేశారు. గత కొన్ని రోజులుగా 'బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర' పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.


Also Read: Rohit Sharma: సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైంది.. ట్రోలింగ్‌పై రోహిత్‌ శర్మ ఫైర్!


Also Read: షమీ ఇంట్లో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది.. జట్టు ఎంపికపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఫైర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook