Brahmamudi Serial Today: రుద్రాణీదే విజయం.. కోమాలోకి సీతారామయ్య రేపే ఆస్తి పంపకాలు
Brahmamudi December 7Th Episode Today: అసలే బ్యాడ్ టైం నడుస్తుంటే ఈ ముసలోడు మనల్ని అన్యాయం చేస్తాడా? టాటా.. బైబై చెబుతాడా ఏంట్రా అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. అప్పుడే కవి పరుగెత్తుకుంటూ ఆస్పత్రిలోకి వస్తాడు. తాతయ్యకు ఎలా ఉంది అని రాజ్‌ను అడుగుతాడు వాళ్లు ఇంకా ఏం చెప్పలేదురా అంటాడు రాజ్.. అసలెందుకు ఇలా జరిగింది అంటాడు కొంతమంది బుద్ధిలేకుండా ప్రవర్తించినందుకు.. ముర్ఖాత్వం పరాకాష్టకు చేరినప్పుడు అంటుంది అపర్ణ. వదిలేయ్ అంటాడు సుభాష్ అంతకు మించి నేను చేయగలిగింది ఏంటండి?.. మావయ్య ఏరోజు సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి సర్ధిచెబుతారు అంటుంది.
Brahmamudi December 7Th Episode Today: అప్పుడే డాక్టర్ వస్తాడు.. డాక్టర్ మా తాతయ్య ఎలా ఉన్నాడు అంటాడు రాజ్. బీపీ ఎక్కువై కోమాలో వెళ్లాడు అంటాడు డాక్టర్ ఒక్కసారిగా అమ్మమ్మ కుప్పకూళిపోతుంది. పరిస్థితి ఏంటని రాజ్ అడిగితే మేం చేయగలిగేది ఏం లేదు అంటాడు డాక్టర్. నెల పట్టొచ్చు, ఏడాది పట్టొచ్చు అంటాడు డాక్టర్. ఇప్పడైతే హార్ట్ కండీషన్ బాగానే ఉంది అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అమ్మమ్మ ఒక్కసారిగా బాగా ఏడుస్తుంది. దీంతో కవి నానమ్మను ఇక్కడు ఉంచితే ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు అందరినీ ఇంటికి తీసుకెళ్లు నేను తాతయ్యను చూసుకుంటాను అని రాజ్‌తో చెబుతాడు.
ఏదైనా ఉంటే నేను కాల్ చేసి చెబుతా అంటాడు. దీనికి అమ్మమ్మ నేను ఆయన్ని వదిలి ఎక్కడకు రాను.. ఆయనతోనే ఉంటా అంటుంది. వెంటనే అపర్ణ అలా అంటే ఎలా అత్తయ్య అందరం ఇక్కడే ఉంటే కూడా బాగుండదు అంటుంది. అయినా కానీ అమ్మమ్మ వినకుండా మారం చేస్తూ అక్కడే కూర్చొంటుంది. లేదు నానమ్మ మనం వెళ్లాలి ఇక్కడ కల్యాణ్ ఉంటాడు పేషంట్ దగ్గర ఒక్కరే ఉండాలి అంటాడు రాజ్. అయినా కానీ, అమ్మమ్మ వినదు. సుభాష్ కూడా అమ్మ వెళ్దాం పదా అంటాడు. కావ్య కూడా అమ్మమ్మ మీరు కూడా ఇక్కడే ఉండి మరో పేషంట్ అవుతారా? తాతయ్య కోలుకుని బయటకు వచ్చినప్పుడు మీరు కూడా ఆనందంతో ఆరోగ్యంగా కనిపించాలి కదా.. అందుకోసం అయినా మీరు ఇంటికి రావాలి అంటుంది.
బోరున ఏడుస్తుంది అమ్మమ్మ అరే కల్యాణ్.. తాతయ్య జాగ్రత్త అని చెబుతాడు. ఇందిరాదేవి బావ.. అంటూ ఏడుస్తుంది. మీరెందుకు ఇక్కడ దిష్టిబొమ్మలా అని స్వప్న రాహుల్ రుద్రాణీలను అంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు కనకం కావ్యతో ఫోన్ మాట్లాడి జాగ్రత్త అని అప్పుడే ఫోన్ పెట్టేస్తుంది. కావ్య నాన్న కనకం.. ఎందుకు ఇంత పొద్దుపోయాక కూడా ఇక్కడే కూర్చున్నావ్ అంటాడు. ఆలోచించి పిచ్చిపట్టింది. అల్లుడిగారికి ఇష్టం లేకపోయినా పెద్దాయన మాట వింటాడు అనుకున్నాం. కానీ బుర్ర తక్కువ ధాన్యలక్ష్మి, రుద్రాణీలు ఆస్తికోసం పోట్లాడారంట పెద్దాయనకు గుండెపోటు వచ్చిందట అంటుంది కనకం.
అయ్యో నమ్మలేకపోతున్నా ఇప్పుడు పెద్దాయనకు అలా అయితే, పెద్దావిడ పరిస్థితి ఏంటి అంటాడు కావ్య నాన్న. కానీ, ఇప్పుడు గొడవలన్ని వారి వల్ల కాదు కావ్య అడుగుపెట్టినందుకే అంటారు అని బాధపడుతుంది కనకం. కావ్య కాలు పెట్టిన వేళ ఆయనకు గుండెపోటు వచ్చిందని అంటారు. అవకాశం వస్తే ఎప్పుడు బయటకు కావ్యను పంపించాలా అని అల్లుడు గారు చూస్తున్నారు అంటుంది.ఇప్పుడు మనం అక్కడికి వెళ్లకపోవడమే మంచిది అంటాడు. మన అమ్మాయి జీవితంలో అడుగడునా కష్టాలే ఉన్నాయి అంటుంది కనకం
మరోవైపు అమ్మమ్మ తాతయ్య ఫోటో చూస్తూ తన గదిలో ఒక్కతే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వస్తుంది. అమ్మమ్మ ఏంటి మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లందరూ ఎలా ధైర్యంగా ఉంటారు. చెట్టంత మనిషి ఉలుకు పలుకూ లేకుండా పడి ఉంటే నాకు ధైర్యం ఎలా వస్తుంది కావ్య అంటుంది. చూడండి అమ్మమ్మగారు ఎన్నో ఆటుపోట్లు చూశారు. మీరు ఇలా అయితే, ఎలా అంటుంది. ఇదంతా మీ తాతయ్య పక్కన ఉండగా దాటాను. ఆయన్ను ఇప్పుడు అలాంటి పరిస్థితిలో చూడటం కంటే చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటుంది. అమ్మమ్మ అలా అనకండి ఊపిరిని ఊపిరితో అల్లుకుని తన ప్రాణాలతో తాతయ్య పోరాడుతున్నారు. మీరు మాత్రం నమ్మకం కోల్పోతున్నారు. మీరు కుంగిపోయి ఇలా బాధపడుతుంటే ఆయన నావల్ల నా చిట్టి ఇలా అయిపోయింది అని ఇంకా కుమిలిపోడా? మీరు ఆనందంగా ఉంటేనే తాతయ్య సంతోషంగా ఉంటారు అంటుంది కావ్య. ఎలాగో అలా అమ్మమ్మను భోజనం తినడానికి ఒప్పిస్తుంది కావ్య.
ఇదీ చదవండి: తిరుచానూరు అమ్మవారికి శ్రీవారి కానుకలు.. 3 కిలోల బంగారం, వజ్రా భరణాలు చూడండి..
ఇక డైనింగ్ టేబుల్ వద్ద అందరూ ఎదురు చూస్తుంటారు. అన్నయ్య ఆకలివేస్తుంది వడ్డించుకోనా అంటుంది రుద్రాణి సుభాష్ అమ్మరాని అంటాడు. ఇందిరా దేవి వచ్చి కూర్చొంటుంది కావ్య అందరికీ వడ్డిస్తుంది. ఇందిరా దేవి మాత్రం అయిష్టంగానే కూర్చొంటుంది. కావ్య అమ్మమ్మగారు తినండి అంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మిలు సైగలు చేసుకుంటూ ఉంటారు. అన్నయ్య ఏమాలోచించారు అంటుంది రుద్రాణి. దేని గురించి ఏవిషయం అంటుంది. ధాన్యలక్ష్మి కూడా ఊరివేసుకోవాలని చూసింది. కొంచెం కూడా జాలి,దయ లేదా ఇప్పుడే అందరం ఒక పరిష్కరం జరగాలి. నాన్నకు ఏమైనా జరగరానిది జరిగితే అప్పుడు అందరం ఇబ్బంది పడతాం అంటుంది.
కావ్య ఎంత కమీషన్ తీసుకున్నారు. ధాన్యలక్ష్మిల ఆస్తినుంచి మీరు ఎంత కమీషన్ తీసుకుంటున్నారు అంటుంది. ఇలాంటి రుద్రాణీ లాంటివారిని ముందుకు తోచి ఆస్తి కోసం గొడవలకు దిగకూడదు ధాన్యలక్ష్మిగారు అంటుంది. ప్రకాశం కూడా దాన్ని మనిషిలాగా గుర్తించలేదు, పెంపుడు జంతువులు అయినా విశ్వాసంగా పడిఉంటాయి అంటాడు. తినేటప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడటం అవసరమా? అంటుంది. అసలు నీకేం సంబంధం ఉంది? అంటుంది ధాన్యలక్ష్మి. ఏమన్నావ్ కావ్య ఇంటి పెద్దకోడలు. ఏ దిక్కలేని రుద్రాణిని మాట్లాడమన్నావు. ఎదురుగా అన్నం ఉంది అది ఎవరు పెట్టిన భిక్ష. ఇద్దరిలో ఎవరు సంపాదిస్తే వచ్చింది. చెంచాగిరి చేస్తున్నావా?
ఇదీ చదవండి : నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్
అక్క రుద్రాణీని పక్కనబెట్టు నేను ఊరివేసుకోవడానికి వెళ్లినా నువ్వు మారలేదు. ఈ కుంటుంబంతో ఏమాత్రం సంబంధంలేని కావ్య ఎందుకు మాట్లాడాలి. పుట్టింట్లో గతిలేదు అని ఏడిస్తే మామగారు ఇక్కడికి తీసుకువచ్చారు, రాజ్ కూడా భార్య కూడా అంగీకరించాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి. నువు ఎన్నైనా చెప్పు ఇంటివ్యవహారంలో కావ్యకు ఏ సంబంధంలేదు అంటుంది. మా పుట్టింట్లో గతిలేక ఇక్కడకు వచ్చిందా నేను కాపురానికి వచ్చినప్పుడు నుంచి చూస్తున్న నీకు పుట్టిల్లు ఉందా? మీ ఇంటికి తీసుకెళ్లావా? అంటుంది. నా కోడలు పుట్టింటి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అంటుంది ధాన్యం. అప్పుడే అమ్మమ్మ ఆపండి... అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అంటుంది. వచ్చే ఎపిసోడ్‌లో చూడాలి ఆస్తిపంపకాలు జరుగుతాయా? లేదా? అని..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.