Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్

IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది... దీంతో రెండు జిల్లాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి.  

2 /5

ఈ ప్రాంతాల్లో ఉండే మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. అంతేకాదు వరికోతకు వెళ్లే రైతులను కూడా జాగ్రత్తలు తీసుకోమని సూచించింది.  

3 /5

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా నేడు మారి పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఈనెల 12వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉంది.  

4 /5

దీంతో ఆ రోజున తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.  

5 /5

ఈ ప్రభావం తెలంగాణలో కూడా మోస్తారుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఉష్ణోగ్రత స్థాయిలు పడిపోయాయి. చెన్నై ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.