Why Brahmastra Pre-Release Event Cancelled: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ నెల 9వ తేదీన ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో మన కింగ్ నాగార్జునతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీ వేదికగా బ్రహ్మస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా రావాల్సి ఉంది. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం స్టార్ట్ అవ్వాల్సి ఉందనగా.. కొన్ని అనుకోని కారణాలరీత్యా ప్రోగ్రాం రద్దయిందని మూవీ యూనిట్ ప్రకటించింది. అభిమానుల అసౌకర్యానికి చింతిస్తున్నామని మూవీ యూనిట్ ఆవేదన వ్యక్తంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రహ్మస్త్ర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు ? 
బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఓ హాట్ టాపిక్ అయిపోయింది. బ్రహ్మస్త్రం మూవీతో సంబంధం ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు, అతిథులు, అభిమానులు అందరూ కార్యక్రమానికి సిద్ధమవుతున్న వేళ ఒక్కసారిగా ఇలాంటి ప్రకటన వెలువడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానులను అంతకు మించి నిరుత్సాహపరిచింది. బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహణ కోసం ఎప్పటిలాగే చిత్ర నిర్మాతలు పోలీసుల అనుమతి తీసుకున్నారని.. కానీ చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడం వల్లే ఈ ఈవెంట్ రద్దయిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అనుమతి లేనిదే నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే ప్లాన్ చేయరు. మరి అనుమతి ఇచ్చిన పోలీసులు ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు వెనక్కి తీసుకున్నారు ? పోలీసుల నిర్ణయం వెనుకున్న అదృశ్య శక్తులు ఏంటి అనే సందేహాలు వినిపిస్తున్నాయి. 


తారక్‌ని చీఫ్ గెస్టుగా ఆహ్వానించడమే వారి ఆగ్రహానికి కారణమైందా ?
బ్రహ్మస్త్ర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది ? పోలీసులను ప్రభావితం చేసేంత శక్తివంతులు ఎవరు అనే అంశంపై పబ్లిక్ చాలా ఆసక్తికరంగా చర్చింకుంటున్నారు. ఇక్కడ చాలామందికి కలుగుతున్న సందేహం ఒక్కటే.. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ కి వచ్చిన సందర్భంలో తారక్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అమిత్ షా -  తారక్ ల మధ్య భేటీ అనేక చర్చలకు దారితీసింది. ముఖ్యంగా బీజేపీ తారక్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉందని.. అందుకే అమిత్ షా, తారక్ ల భేటీ జరిగిందనే టాక్ బలంగా వినిపించింది. 


ఇది కేసీఆర్ పనే అంటున్న నాగ్ ఫ్యాన్స్


ఇక్కడ సీన్ కట్ చేస్తే.. అమిత్ షాతో తారక్ భేటీని  జీర్ణించుకోలోని వారిలో టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కూడా ఉన్నారని.. అందుకే అది మనసులో పెట్టుకునే ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్న కార్యక్రమాన్ని ఏకంగా రద్దు చేయించే విధంగా పోలీసుల చేత అనుమతి రద్దు చేయించి ఉంటారని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కి నచ్చకపోయినా.. ఆయనకు ఆగ్రహం తెప్పించేలా ఎవ్వరు వ్యవహరించినా.. అదును చూసుకుని ఆయన వంతు తీర్చుకుంటారని.. ఎన్టీఆర్‌ని చీఫ్ గెస్టుగా ఆహ్వానించినందుకు బ్రహ్మస్త్రం మూవీ యూనిట్‌కి ఇది కేసీఆర్ సర్కారు ఇచ్చిన షాక్ అనేది సదరు టాక్ సారాంశం.


Also Read : Megastar Chiranjeevi's Bad Luck: మెగాస్టార్ చిరంజీవిది ఐరెన్ లెగ్గా.. దారుణంగా ట్రోలింగ్!


Also Read : Hiding OTT Partner Names: సినిమా టైటిల్స్ లో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ దాపరికం.. పెద్ద ప్లానే ఇది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి