Ayan Mukerji reveals the Brahmastra Vision: బాలీవుడ్ నుంచి పూర్తి స్థాయి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న బ్రహ్మాస్త్ర సినిమా మీద సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్,  ఆలియా భట్,  అక్కినేని నాగార్జున,  అమితాబచ్చన్,  మౌని రాయ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాదిలో రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు,  ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేయగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? అస్త్రావర్స్ అంటే ఏంటి? అనే విషయాలు ఆ వీడియోలో క్షుణ్ణంగా కూలంకషంగా చర్చించారు దర్శకుడు అయ్యాన్ ముఖర్జీ. పురాణాల్లో అస్త్రాల గురించి అనేక వివరాలు ఉన్నాయని చెబుతూ ఆ అస్త్రాలన్నింటికీ గురువు లాంటి బ్రహ్మాస్త్రం గురించి కొందరు ఋషులు మహా యాగం చేశారని అప్పుడు అనంత విశ్వం నుంచి ఒక స్వచ్ఛమైన శక్తి కిందకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.


అలా వచ్చిన శక్తి ఒక్కొక్కరికి ఒక్కో అస్త్రం అందించిందని అప్పటి నుంచి వంశపారంపర్యంగా ఈ శక్తులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.  ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఆ శక్తులు కలిగిన వ్యక్తులు ఉన్నారని చెబుతూ వారందరు కథనే మీ ముందుకు తీసుకొస్తున్నానని అయాన్ ముఖర్జీ చెప్పుకొచ్చారు. ఇందులో మొదటి భాగంగా వస్తున్న శివ పార్ట్ తనకు ఇష్టమైన పార్ట్ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అంతేకాక వానరాస్త్ర,  నందిఅస్త్ర,  ప్రభాస్త్ర,  జలస్త్ర,  పవనాస్త్ర వంటి అస్త్రాల గురించి ప్రస్తావించారు. భారీ అంచనాలతో రూపొందించబడిన ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది.
 


 

 

 

 



Read Also: Janhvi-Sara: హాట్ హాట్‌గా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్.. ముద్దుగుమ్మలు ఒకరినికోరు పట్టుకుని..!


Read Also: Pelli SandaD: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దం.. ఏ రోజు టెలీకాస్ట్ అంటే?




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.