Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా టీజర్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది. సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన బుజ్జి ఇలా రా మూవీ టీజర్ చూస్తే ఆద్యంతం చాలా ఆసక్తికరంగా అనిపించింది. వరంగల్ పట్టణంలో జరిగే వరుస కిడ్నాప్ ఉదంతాల చుట్టూ ఈ కథ రాసుకున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే, ఇంతకీ అసలు ఈ వరుస కిడ్నాప్‌లకు పాల్పడుతున్న సీరియల్ కిడ్నాపర్ ఎవరనేదే సస్పెన్స్‌కి గురి చేసే అంశం అనిపించేలా బుజ్జి ఇలా రా టీజర్ (Bujji Ila Raa Teaser) కట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది అంగ్రెజ్, టాటా బిర్లా మధ్యలో లైలా నుంచి గరుడవేగ చిత్రం వరకు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫి అందించిన అంజి ఈ సినిమాను తానే డైరెక్ట్ చేస్తూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. హిలేరియస్ కామెడి సినిమాలకు పెట్టింది పేరు అయిన ఫేమస్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి (Director G Nageshwar Reddy) తన బృందంతో కలిసి ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలు పర్యవేక్షించారు.



Also read : Kota Srinivasa Rao: అనసూయ డ్రెస్సింగ్‌ మారిస్తే బాగుంటుంది: కోటశ్రీనివాసరావు


బుజ్జి ఇలా రా సినిమాలో చాందిని తమిళరసన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali), శ్రీకాంత్ అయ్యంగార్, సత్యకృష్ణ, టెంపర్ వంశీ, వేణు, భూపాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బుజ్జి ఇలా రా సినిమా టీజర్ చూస్తే సస్పెన్స్‌కి గురి చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించేలా ఉంది. అయితే తారాగణం మాత్రం కామెడి పండించే సునీల్, ధన్‌రాజ్ (Sunil, Dhanraj) లాంటి వాళ్లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు. దీంతో అసలు బుజ్జి ఇలా రా సినిమా (Bujji Ila Raa movie) ఎలా ఉండనుందా అనే క్యూరియాసిటీ కూడా కలుగుతోంది.


Also read : Surekha Vani Second Marriage photos: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..? వైరలైన ఫోటోలు


Also read : Movies this Week: ఈ వారం ఓటీటీ, ధియేటర్ల రిలీజ్ చిత్రాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook