Bullet Bhaskar Satires on Indraja బుల్లితెరపై సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ కాంబో హిట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు వెండితెరపైనా నవ్వులు పూయించేందుకు వచ్చారు. త్రీ మంకీస్ అంటూ ఈ ముగ్గురూ కలిసి సినిమాను చేశారు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. గాలోడు సినిమా ఫబ్రేక్ ఈవెన్ అయి సుధీర్‌కు ఫస్ట్ టైం హిట్ వచ్చినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో థాంక్యూ స్పెషల్ ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో సుధీర్, గెటప్ శ్రీను కూడా వచ్చారు. అలా చాలా రోజుల తరువాత రాం ప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్ వంటి వారు ముగ్గురూ ఒకే స్టేజ్ మీద కనిపించడంతో అభిమానులకు ఫుల్ ఖుషీ అనిపించినట్టుంది. అయితే ఈ ముగ్గురిని కలిపి చూడటంతో ఇంద్రజ కడుపు నిండినట్టు అయింది.


గాలోడు, సాఫ్ట్ వేర్, త్రీ మంకీస్ సినిమాల మీద బుల్లెట్ భాస్కర్, పంచ్ ప్రసాద్ కామెంట్లు వేశారు. అసలు ఆ సినిమాలు ఎవరు చూశారు?.. థియేటర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి.. నా పిల్లల్ని ముప్పై రోజులు థియేటర్‌కు తీసుకెళ్లాను.. ఎవ్వరూ లేరు.. చక్కగా ఆడుకున్నారు.. అని కౌంటర్లు వేశాడు. నాకు మొన్నటి వరకు మోకాల్ నొప్పి ఎక్కువగా ఉండేది.. సుధీర్ సినిమాకు వెళ్లాను.. తలనొప్పి ఎక్కువ అయింది.. ఆ దెబ్బతో మోకాలి నొప్పి తగ్గిపోయిందని కౌంటర్లు వేశారు.


ఇక సుధీర్, ఇంద్రజల మీద కూడా సెటైర్లు వేశారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో ఆవిడ అమ్మగా నటించిందనే సుధీర్ అలా పిలుస్తాడు అని రాం ప్రసాద్ చెబుతాడు. ఏంటి మీరు అందులో నటించారా? ఎందుకు నటించారు? ఫ్రీగా నటించారా? డబ్బులు తీసుకున్నారా? అంటూ పరువుతీసేశారు. ఇలా చివరకు ఇంద్రజ, సుధీర్‌లను దారుణంగా ఆడుకున్నారు.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


చివరకు సుధీర్‌ను బైక్ టైర్లలో గాలి నింపేవాడిలా మార్చేశారు.. బైక్ సర్వీసింగ్ చేసేదానిలా రష్మీని మార్చేశారు పంచ్ ప్రసాద్. చాలా రోజుల తరువాత వచ్చిన సుధీర్‌ను బుల్లెట్ భాస్కర్, పంచ్ ప్రసాద్‌లు ఇలా వాడేసుకున్నారు. కౌంటర్లతో పిచ్చెక్కించారు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook