Sreeleela Upcoming Movies: పెళ్లి సందD, ధమాకా సినిమాలతో టాలీవుడ్ లో శ్రీ లీల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొదటి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో.. ఆమె మీద ఆఫర్ల వర్షం కురిసింది. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తప్పటడుగులు వేసిన శ్రీ లీల బరుసగా డిజాస్టర్లు అందుకుంది. భగవంత్ కేసరి సినిమా తప్ప ఈమె నటించినా ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. మహేష్ బాబు సరసన నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించలేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస ఫెయిల్యూర్స్ తర్వాత శ్రీ లీల కూడా సినిమా నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని తన ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ పూర్తిచేసుకుంది. మళ్లీ సినిమాల్లో తన బిజీ అవ్వడానికి రెడీ అవుతున్న శ్రీ లీల నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇది కాకుండా శ్రీ లీలకి ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాశమే నీ హద్దురా వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పురణనూర్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నట్లు సమాచారం.


సూర్య, దుల్కర్ సల్మాన్, నజ్రియా నటిస్తున్న ఈ సినిమా ఒక హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ఆంటీ హిందీ ఇంపోజిషన్ మూమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోగా.. శివ కార్తికేయన్ ఇప్పుడు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు అని టాక్. తమిళ్ ప్రేక్షకులకి ఈ సినిమా మీద బాగానే అంచనాలు ఉన్నాయి. 


అలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది శ్రీలీల. మరి ఈ సినిమాతో అయినా శ్రీ లీలా మంచి హిట్ అందుకుంటే.. ఆమెకు మళ్ళీ బోలెడు ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆమె కెరియర్ ను ఏ విధంగా మలుపు తిప్పుతుందో చూడాలి. పైగా హీరోయిన్లను అద్భుతంగా చూపించడంలో.. సుధా కొంగర తర్వాతే ఎవరైనా. మరి శ్రీలీల ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.


Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..


Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.