Case Filed Against Allu Arjun: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడిపోయింది. మే 13వ తేదీ సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల హడావిడి ఈరోజు సాయంత్రం తో ముగిసిపోయింది. ఈరోజు సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులోకి వచ్చేసింది. ఇక ప్రచారానికి ఉన్న ఈ చివరి రోజున వారి వారి చివరి బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్నారు అన్ని పార్టీలు. ముఖ్యంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన విజయం కోసం ఏకంగా మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌ని రంగంలోకి దించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు . ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కాగా రవిచంద్ర రెడ్డి అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కావడంతో.. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి తో కలిసి ఈరోజు నంద్యాలకు చేరుకొని మరి ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల ఓటర్లు తప్పకుండా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా 2019 ఎన్నికల్లో రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు అల్లు అర్జున్.


ఇక తన మామయ్య పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ వారికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫాన్స్ కూడా కొంచెం ఫీల్ అయ్యారు. మరోవైపు రెండు రోజుల క్రితమే బన్నీ తన ట్విట్టర్ అకౌంట్లో.. పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.  పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు.  “ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్. అయితే రవిచందర్ రెడ్డి తో ఉన్న స్నేహం వల్ల మాత్రమే ఈ ప్రచారం చేయాల్సి వచ్చుంటుందని అల్లు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.


Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


Read more: Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter