Chandrababu Wishes to Pawan Kalyan Became Hot Topic: మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు. మెగా అభిమానులు అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అసంఖ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ శుభాకాంక్షలు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున చంద్రబాబు వ్యవహార శైలి ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అసలు విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రం లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు కానీ చంద్రబాబు మాత్రం చెప్పలేదని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి మేలో ఎన్ఠీఆర్ పుట్టిన రోజునే ఇద్దరు టీడీపీ నాయకుల బర్త్‌డేలు ఉండడంతో చంద్రబాబు తన ట్విట్టర్‌ అకౌంట్లో వాళ్లకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు కానీ జూనియర్‌ ఎన్టీయార్‌కు మాత్రం విషెస్‌ చెప్పలేదు. పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, ఇంట్లో మనిషి, బంధువు కూడా అయిన ఎన్టీఆర్‌ విషయంలో పట్టనట్టు వ్యవహరించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి శుభాకాంక్షలు చెప్పారు అదే సొంత బంధువైన ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రం పట్టించుకోలేదని అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ కంటే పవన్ ఎక్కువయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 
Also Read: No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?


Also Read: Happy Birthday Pawan Kalyan: పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌.. వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి