Nayanthara: నయనతార వివాదంలో మరో బిగ్ ట్విస్ట్.. కీలక ప్రకటన చేసిన చంద్రముఖి మూవీ మేకర్స్..
Chandramukhi movie Team: చంద్రముఖి మూవీ టిమ్ తాజాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటికి నోటీసులు పంపిన అంశంపై స్పందించినట్లు తెలుస్తొంది.
Chandramukhi movie Team reacts on notice issue controversy: నటి నయన తారకు చంద్రముఖీ మూవీ టీమ్ నోటీసులు పంపిందని కూడా సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి.ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా..చంద్రముఖీ మూవీ టిమ్ స్పందించినట్లు తెలుస్తొంది. ఈ నోటీసులు పంపినట్లు వస్తున్నవార్తలలో నిజంలేదని, కేవలం రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.
అయితే.. నయన తార..తన డాక్యుమెంటరీ.. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్, నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నయన తార.. చంద్రముఖీ సినిమాలోని కొన్నిక్లిప్ లను ఉపయోగించుకున్నారని.. నిర్మాతలు ఈ విషయంపై సీరియస్ అయ్యారని.. నయన తారకు.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తు నోటీసులు జారీచేశారని ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా.. దీనిపై మూవీ టీమ్ స్పందించి ఇవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేసినట్లు తెలుస్తొంది. నయన తారకు నోటీసులు పంపలేదని చంద్రముఖిమూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నయన్ కు గతంలో నానుమ్ రౌడీదాన్ నుంచి మూడు సెకన్లను ఉపయోగించుకున్నందుకు.. ధనుష్.. రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Read more: Snakes in Dream: కలలో పాములు కన్పిస్తున్నాయా..?.. మీకు వంద శాతం జరిగేది ఇదేనంట..!
దీంతో నయన తార.. ధనుష్ పై తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తు తన ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నయన తారకు ఎలాంటి నోటీసులు రాలేదని చంద్రముఖీ టీమ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు మాత్రం కూల్ అయినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook