Special Video from Hero Varun Tej's Movie Ghani: మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్ (Varun Tej) నటిస్తున్న చిత్రం 'గని' (Ghani). ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ రోజు నవంబర్ 11 వ తేదీన ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ తో పాటు టీజర్ విడుదల చేసే తేదీని కూడా ప్రకటించారు చిత్ర యూనిట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మొదటగా ఈ సినిమా అప్డేట్ కి వస్తే.. గని సినిమాలో నటిస్తున్న నటీ నటుల పరిచయంతో కూడిన ఒక వీడియో విడుదల చేశారు. నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty), కన్నడ హీరో ఉపేంద్ర (Upendra), నవీన్ చంద్ర, నరేష్, నదియా మరియు తనికెళ్ళ భరణి వంటి వారు నటిస్తుండటం విశేషం. 


Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


అంతేకాకుండా ఈ చిత్రానికి తమన్ (Taman) స్వరాలు అందిస్తుండగా.. ఈ నెల 15 వ తేదీన టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కిరణ్ కొర్ర పాటి ఈ చిత్రానికి దర్శకత్వం వధిస్తుండగా.. అల్లు బాబీ నిర్మిస్తున్నారు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ (Sayu Manjrekar) హీరోయిన్ గా జత కట్టనుంది. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల అవనున్న సంగతి మన అందరికీ తెలిసిందే!




ఇప్పటికే విడుదలైన  'గని' సినిమా సాంగ్​ ప్రోమో సినీ ప్రేక్షకులని ఆకట్టువుగా.. టీజర్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫైట్లను లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేయటం మరో విశేషం. వీరిద్దరూ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కావటం వల్ల సినిమాలోని యాక్షన్ సీన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా, సినిమాలో నటించే తారాగణం భారీగా ఉండటంతో సినిమాపై అంచానాలు రెట్టింపు అయ్యాయి. 


Also Read: Shoaib Akhtar: ఆసీస్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు..అతడి కెప్టెన్సీ బాగాలేదు, షోయబ్ సంచలన వ్యాఖ్యలు


ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాల విషయాన్ని వస్తే.. 'ఎఫ్​ 2' (F2) సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి (Anil Raavipurid) తెరకెక్కిస్తున్న 'ఎఫ్​ 3' (F3)  సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.  విక్టరీ వెంకటేష్​ (Venkatesh), వరుణ్ తేజ్, తమన్నా (Thamannaah), మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి