Michaung Cyclone effect: మిగ్‌జాం తుపాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సైక్లోన్ ధాటికి చెన్నై నగరం నీటమునిగింది. ఎడతెరిపి లేకుండా వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. బలమైన ఈదురుగాలులు వీయడంతో భారీ వృక్షాలన్నీ నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై ఉన్న కార్లు, బైక్స్ కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ తుపాన్ వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు, బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, కార్తీ ఆర్థిక సాయం


ఇదిలా ఉంటే వరద బాధితులకు అదుకునేందుకు నడుంబిగించారు సూర్య బ్రదర్స్. హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తీ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది. సూర్య ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలిస్తున్న్నారు. ప్రస్తుతం సూర్య కంగువ అనే భారీ పిరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. 



Also Read: Michaung Cyclone Impact: మిచౌంగ్ తుపాను ప్రభావం, మూతపడ్డ విమానాశ్రయాలు


విశాల్‌ అసహనం


మరోవైపు చెన్నై నగరంలో నెలకొన్న పరిస్థితులపై హీరో విశాల్ స్పందించారు. 2015లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. అది జరిగి ఏళ్లు గడుస్తున్నా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోగా.. మరింత అధ్వానంగా తయారైందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించి విశ్వాసం నింపాలని ఆయన కోరారు. అందరూ బయటకు వచ్చి సాయం అందించాలని కోరారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 



Also Read:  Cyclone Michaung Live Updates: బాపట్లలో తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook