Cyclone Michaung Update Live Tracker: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకు 170 కిలోమీటర్లు, బాపట్లకు 150, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో మిచౌంగ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు వస్తోంది. మంగళవారం మధ్యాహ్ననికి బాపట్ల వద్దే తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. చెన్నైలో వరదనీరు వీధుల గుండా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.