Chiranjeevi Allu Arjun Movie: మెగా కాంపౌండ్ నుంచి మరో మల్టీ స్టారర్ చిత్రం రానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కలిసి నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. టాలీవుడ్ లోని ప్రముఖ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా కథను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. కథ విన్న చిరు.. అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇందులో రెండో ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్ ను ఎంపిక చేయమని చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగే అని చెప్పుకొవచ్చు.


అయితే చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి స్క్రీన్ షేర్ (Chiranjeevi Allu Arjun) చేసుకోవడం ఇది తొలిసారి కాదు. ‘డాడీ’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాల్లో అల్లు అర్జున్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి పాత్రలో చిరంజీవితో కలిసి నటించడం ఇదే తొలిసారి కాబోతుంది.


ప్రస్తుతం చిరంజీవి వరుస చిత్రాలతో (Chiranjeevi Movies) బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో ఆయన కలిసి నటించిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల (Acharya Release Date) ముందుకు రానుంది. దీంతో పాటు ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకరుడు’, కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala Movies).. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ముకుందా’, ‘బ్రహ్మోత్సవం’, ‘నారప్ప’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.


Also Read: Aryan Khan Bail : బెయిల్‌పై బయటికొస్తున్న ఆర్యన్ ఖాన్‌.. ముస్తాబైన ‘మన్నత్’  


Also Read: Malaika Arora Khan latest Pics: ఇప్పటికీ కెవ్వు కేక పెట్టిస్తున్న మలైకా అరోరా లేటెస్ట్ ఫోటోస్ గ్యాలరీ  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook