Pawan Kalyan in Chiranjeevi Movie: సాధారణంగా మల్టీ స్టారర్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ.. చిరంజీవి, పవన్ కల్యాణ్​ సినిమా అంటే (Pawn in Chiru Cinema).. ఇక సందడి మామూలుగా ఉండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే.. చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకు ఇది సాధ్యం కాలేదు. గతంలో చిరు నటించిన 'శంకర్​దాదా జిందాబాద్' సినిమాలో.. పవన్ ఓ గెస్ట్​ రోల్ చేశారు. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కానందున ఫ్యాన్స్​ ఆశ ఇంకా నెరవేరలేదు. కానీ త్వరలోనే ఫ్యాన్స్​ ఆశ తీరనున్నట్లు (Chiru, Pawan Multi starar Movie) తెలుస్తోంది.


చిరు 154వ సినిమాలో పవన్ నటిస్తారని టాలీవుడ్ వర్గాల్లో (Chiru 154 Movie Shooting) టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్​ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ఈ సినిమాలో పవన్​ నటిస్తారా? నటిస్తే పూర్తి స్థాయి పాత్రా? లేదా గెస్ట్ రోలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ ఈ అంచనాలు నిజమై చిరు, పవన్ ఒకే తెరపై కనిపిస్తే.. మెగా ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.


Also read: Samantha: విడాకుల తర్వాత రెమ్యూనరేషన్ పెంచిన సమంత.. ఎంతో తెలుసా?


Also read: Skylab Trailer: స్కైల్యాబ్ ట్రైలర్..స్కైల్యాబ్ నేలపై కూలితే.. ?


వరుస సినిమాలతో మెగా బ్రదర్స్ బిజీ..


నిజంగానే చిరు, పవన్ ఈ సినిమాలో నటించినా.. అది రిలీజ్ (Aacharya Movie) అయ్యేందుకు చాలా సమయం పట్టొచ్చని తెలుస్తోంది.


ఎందుకంటే.. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత... లూసీఫర్​ రీమేక్ 'గాడ్​ ఫాదర్​'.. 'భోళాశంకర్' వంటి సినిమాలు తర్వతి వరుసలో ఉన్నాయి. ఈ సినిమాలన్ని విడుదలయ్యాక గానీ.. బాబీతో చేస్తున్న 154వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.


ఇటు పవన్ కల్యాణ్​ కూడా.. ప్రస్తుతం 'భీమ్లానాయక్'​  (Bheemla nayak) సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు'.. గబ్బర్​ సింగ్ డైరెక్టర్ హారీశ్ శంకర్​ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు పవన్​. అందుకే చిరు, వవన్​ ఒకే సినిమాలో కనిపించినా.. అది ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. ఇంకా చాలా సమయం పట్టే అవకాశముంది.


Also read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ?


Also read: 3 Roses Teaser: విమర్శలపాలవుతున్న 3 రోజెస్ టీజర్


టాలీవుడ్​లో మల్టీ స్టారర్​ జోరు..


ప్రస్తుతం టాలీవుడ్​లో మల్టీ స్టారర్​ చిత్రాల జోరు (Multi Starar Movie in Tollywood) నడుస్తోంది. ఆర్​ఆర్​ఆర్(RRR Film)​, భీమ్లా నాయక్ చిత్రాలు ఇందుకు మంచి ఉదాహరణ. దీనికి తోడు చిరంజీవి ఆచార్య సినిమాలో.. రామ్​ చరణ్​ కూడా ఓ కీలక పాత్రలో (Ram Charna in Aacharya Movie) నటించడం తెలిసిందే.


Also read: Marakkar OTT Release Date: రూ.100 కోట్లతో నిర్మించిన నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా.. చివరికి ఓటీటీ రిలీజ్


Also read: Vijay Devarakonda Love Breakup: రియల్​ లైఫ్​లో లవ్​ బ్రేకప్ అయిందన్న అర్జున్ రెడ్డి హీరో 'విజయ్ దేవరకొండ'!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి