chiranjeevi - chinni krishna: తప్పు అయింది క్షమించండి అంటూ చిరంజీవిని సారీ చెప్పిన చిన్నికృష్ణ..
chiranjeevi - chinni krishna: తప్పు అయింది క్షమించండి అంటూ చిరంజీవికి సారీ చెప్పారు ప్రముఖ రచయత చిన్నకృష్ణ. తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్బంగా ఆయన్ని కలిసారు ఒకప్పటి స్టార్ రైటర్ చిన్నికృష్ణ.
chiranjeevi - chinni krishna: మెగాస్టార్ చిరంజీవికి రైటర్ చిన్నికృష్ణ సారీ చెప్పారు. చిన్ని కృష్ణ విషయానికొస్తే..రజినీకాంత్‌తో నరసింహా, బాలకృష్ణతో నరసింహానాయుడు, చిరంజీవితో ఇంద్ర వంటి సినిమాలకు రచయతగా పనిచేసి అప్పట్లో స్టార్ రైటర్‌గా సత్తా చూపెట్టాడు. ఆ తర్వాత ఈయన కలం నుంచి ఆ రేంజ్ సినిమా కథలు పడలేదు. దీంతో నేమ్ అండ్ ఫేమ్ పరంగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిన్నికృష్ణ ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి తన కళ్లు చెమర్చాయని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు అన్నయ్యను నోటితో అనరాని మాటలు అన్నాను. అవేమి మనసులో పెట్టుకోకుండా చిరంజీవి.. నేను కలుస్తా అనగానే వెంటనే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే కాదు.. ఒకప్పటిలా తనను పలకరించిన విధానం చూసి పులికించిపోయినట్టు చెప్పుకొచ్చారు రచయత చిన్నకృష్ణ.
ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ.. గతంలో కొంతమంది నన్ను ఎగదోయడంతో నా జీవితంలోనే అత్యంత దారుణమైన బ్యాడ్‌టైమ్‌లో అన్నయ్యను నా నోటితో అనరాని మాటలన్నాను. జీవితంలో ఏ మనిషైనా టైమ్ బ్యాడ్ అయినపుడు తెలియకుండానే తప్పులు చేస్తారు. నేను ఆ తప్పు చేశానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. భారతదేశం గర్వించదగ్గ రచయిత చిన్నికృష్ణ అని అప్పట్లో ‘ఇంద్ర’ సినిమా సమయంలో చిరంజీవి గారు అన్నమాటను గుర్తు చేసుకున్నారు. ఆ రోజే నా జన్మ ధన్యమైంది.
నేనే తప్పుగా ఆయనతో మాట్లాడిన రోజు తర్వాత మళ్లీ ఇదే ఆయన్ను వచ్చి కలవడం. అయినప్పటికి ఆయన ప్రేమలో అణువంతైన మార్పులేదు. ఆ గుణమే శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిని చేసిందని కొనియాడారు. అదే వినయ విధేయతలు చిరంజీవిని మెగాస్టార్ చేసింది. ఇప్పుడు పద్మవిభూషణున్ని చేసింది.నేను ఆయన పట్ల చేసిన తప్పును భగవంతుని ముందు, నా స్నేహితులముందు, కుటుంబసభ్యులముందు ఎన్నిసార్లు చెప్పుకున్నానో నాకే తెలుసు అంటూ పశ్చాతాపం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ఆయన ముందు చెబితే అవన్నీ మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా తన స్టైల్లో తనను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఏం కథలు రాస్తున్నావు చిన్ని అని ఆప్యాయంగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి నా ఈ జీవితానికీ. మళ్లీ నాకు ఆయనకు ‘‘ఇంద్ర–2’’లాంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే అలాంటి మంచి వార్త అందరు వింటారని అనుకుంటున్నాను. అన్న అన్నయ్య క్షమించు...మీ సోదరుడు చిన్నికృష్ణ అని చిరంజీవిని కలిసిన తర్వాత తన ఆవేధనను పంచుకున్నారు చిన్నికృష్ణ.
Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter