Megastar non veg recipe for Mom: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఎం చేసినా.. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నటన పట్ల ఎంత ఏకాగ్రత, అంకితభావంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అదేవిధంగా ఆయనకు ఖాళీ దొరికితే చాలు.. ఎప్పుడూ కుటుంబానికి ప్రధాన్యతనిస్తూ.. వారితో సరదాగా కాలక్షేపం చేస్తూ ప్రతీక్షణాన్ని ఆస్వాదిస్తుంటారు. గతంలో చిరంజీవి తన తల్లికి పలు వంటలు చేసి మరి రుచి చూపించారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం కూడా ఒక ప్రత్యేకమైన నాన్‌వెజ్ వంటను చేసి తన తల్లికి స్వయంగా వడ్డించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Also read: తమిళ సినిమాపై కన్నేసిన Chiranjeevi ?


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

#SundaySavors


A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on


గోదావరి పరిసరాల్లో దొరికే కట్టె పరిగె చిన్న చేపలకు మసాలా, చింతతొక్కు అంటించి మంచిగా ఫ్రై చేశారు. అనంతరం ఆయన తన తల్లికి దగ్గరుండి మరీ వడ్డించారు. దీనిద్వారా తన తల్లి అంటే ఎంత ఇష్టమో మరోసారి ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరు వంట ఎలా ఉందంటూ తల్లిని అడిగితే.. దానికి ఆమె ఎమని జవాబిచ్చిందో తెలుసుకోవాలంటే.. మీరు వీడియోను చూడాల్సిందే. Also read: Somu Veerraju: చిరంజీవితో సోము వీర్రాజు భేటీ