ntr side hero in RRR Movie రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన మన తెలుగు వాళ్లు ఆహా ఓహో అని ఎక్కువగా కీర్తించలేదు. నార్త్‌లో ఈ సినిమా పర్వాలేదనిపించింది. అయితే వెస్ట్రన్ ఆడియెన్స్ మాత్రం మన ఆర్ఆర్ఆర్ సినిమాను కీర్తించారు. అదే సమయంలో గే సినిమా అంటూ గేలి చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్‌ నామినేషన్‌ల వరకు వెళ్లడం వంటివి చూసి అంతా షాక్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఆస్కార్ కూడా అడుగు దూరంలో ఉంది. ఇదంతా పక్కన పెడితే.. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లలో ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలన్నా విషయం మాత్రం ఎప్పటికీ తేలదు. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన వారిలో కొంత మంది ఇది రామ్ చరణ్‌ సినిమా అని, ఎన్టీఆర్ సైడ్ హీరో అని కౌంటర్లు వేశారు. ఇందులో ఎన్టీఆరే మెయిన్ హీరో అని ఇంకొంత మంది రివర్స్ కౌంటర్లు వేశారు.


ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన టైంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్‌ పేరు మార్మోగిపోయింది. రామ్ చరణ్‌ నటనను చూసి అంతా ఫిదా అయ్యారు. ఇక తన పాత్రను సైడ్ హీరోలా డిజైన్ చేశాడంటూ రాజమౌళి మీద ఎన్టీఆర్ ఫైర్ అయినట్టుగా కూడా రూమర్లు వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌ పేరును ఇంటర్నేషనల్ వైడ్‌గా వినిపించేట్టు చేయడం కోసమే వెరైటీ సంస్థతో అలా గొప్పగా రాయించారనే టాక్ కూడా వచ్చింది.


ఆస్కార్ బెస్ట్ యాక్టర్‌ రేసులో ఎన్టీఆర్ ఉన్నాడంటూ వెరైటీ సంస్థ ఊదరగొట్టేసింది. కానీ చివరకు నామినేషన్‌లో ఎన్టీఆర్ పేరు వినిపించలేదు. ఇదంతా ఒకలా ఉంటే.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి వారు రాజమౌళిని పొగడటం, ఆర్ఆర్ఆర్ సినిమా గురించి గొప్పగా చెప్పిన విజువల్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి.


 



జేమ్స్ కామెరూన్ మాట్లాడిన వీడియోలను నందమూరి ఫ్యాన్స్ ఒకలా ప్రచారం చేసుకున్నారు. మెగా అభిమానులు ఇంకోలా ప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు జేమ్స్ కామెరూన్ మాత్రం రామ్ చరణ్‌ రోల్, తీర్చిదిద్దిన విధానం, రాజమౌళి కథనాన్ని రామ్ చరణ్‌ కోణంలో చూపించాడు.. అద్భుతంగా ఉందంటూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.


రామ్ చరణ్‌ను జేమ్స్ కామెరూన్ పొగిడిన విజువల్స్‌ను షేర్ చేస్తూ చిరంజీవి మురిసిపోయాడు. ఓ తండ్రిగా గర్వపడుతున్నానంటూ ట్వీట్ వేశాడు. చిరంజీవి వేసిన ట్వీట్‌తో మరోసారి ఎన్టీఆర్ సైడ్ హీరో అనే టాక్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్‌ మెయిన్ హీరో అని, ఎన్టీఆర్ సైడ్ హీరో అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అన్నట్టుగా ట్విట్టర్‌లో వార్ జరుగుతోంది.


Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook