NTR Missed Kaththi Remake: ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి!
NTR Missed Kaththi Remake: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సిన సినిమా అట, ఈ విషయాన్ని తాజాగా గోపీచంద్ మలినేని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi hit With NTR Missed Movie: ఒక హీరో చేయాల్సిన సినిమాలు, ఆ హీరో డేట్లు కుదరకపోవడం వల్లనో లేక ఇతర కారణాల వల్లో మరో హీరో చేసి సూపర్ హిట్ల అందుకున్న దాఖలాలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక ఉదంతమే మరో సారి తెర మీదకు వచ్చింది. తాజాగా వీర సింహారెడ్డి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ మలినేని తాను గతంలో ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా మిస్ అయింది అని చెప్పుకొచ్చారు. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కి తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన కత్తి సినిమాని తాను ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నానని, ఈ విషయం మురుగదాస్ దగ్గరికి తీసుకు వెళ్తే ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడారని చెప్పుకొచ్చారు. గోపీచంద్ సినిమా చేస్తాను అంటే ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారని అయితే అనూహ్యంగా ఆ హక్కులు మెగాస్టార్ చిరంజీవి కొనుక్కోవడంతో ఆయన ఆ సినిమా తెరకెక్కించారని అన్నారు.
అప్పట్లో విజయ్ ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయాలని భావించారని కొంత సందిగ్దం కొనసాగుతున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అక్కడ నిర్మాతలతో మాట్లాడి ఆ సినిమా కొనుగోలు చేయడంతో మేము ఆ ప్రాజెక్టు డ్రాప్ అయ్యామని గోపీచంద్ మలినేని అన్నారు. అయితే మరోసారి దిల్ రాజు ప్రొడక్షన్లో తాను ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలని అనుకున్నానని అయితే తాను చెప్పిన కథ విన్న తర్వాత ఎన్టీఆర్ ఇది చాలా వెయిట్ ఉన్న మాస్ సబ్జెక్ట్ అని నేను నీ నుంచి ఒక కామెడీ సబ్జెక్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారని అలా మరోసారి కూడా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు మిస్ అయిందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.
మొత్తం మీద ఎన్టీఆర్ చేయలేకపోయినా కత్తి రీమేక్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేయడమే కాదు రీ ఎంట్రీ అదే సినిమాతో ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒక వేళ అదే సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేసుంటే మరింత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉండేదని, నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Also Read: VSR vs WV Collections: 'వీర సింహా' కంటే వెనుకొచ్చి 34 కోట్ల ముందంజలో వీరయ్య!
Also Read: Singer Mangli Attack: మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook