Chiranjeevi Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం బింబిసారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసింది అయితే ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తామంటూ.. ఈ సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసిన రోజే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మే నెలలో విడుదల చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి మళ్ళీ ఈ సినిమా విషయంలో తప్పు చేస్తున్నాడు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.  అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి ఇటీవలే టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇందులో గ్రాఫిక్స్ సరిగా లేదని ట్రోల్స్ ఎదుర్కొంది. వి ఎఫ్ ఎక్స్ నాణ్యత పై ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.  దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ పైగా ఆది పురుష్ తరహాలో ఉందంటూ ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. 


అయితే ఇప్పుడు మేకర్స్ గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  గ్రాఫిక్స్ పై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షిస్తున్నారట. దగ్గరుండి మరీ  ఇందులోని లోపాలను సరి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇద్దరు డైరెక్టర్స్ , కెమెరామెన్ చోటా కె నాయుడుతో కలిసి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


 


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


 


ఇదిలా ఉండగా మరోవైపు మొన్నా మధ్య చిరంజీవి ఆచార్య సినిమాలో వేలు పెట్టడం వల్లే సినిమా డిజాస్టర్ అయిందని కొరటాల శివ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు విశ్వంభర లో కూడా వేలు పెడుతున్నాడు చిరంజీవి . మరి ఈ సినిమా కూడా మరో ఆచార్య అవుతుందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుండగా ఎక్కువ సమయం ఉండడంతో సినిమాను పగడ్బందీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter