Chiranjeevi Commercial Add: చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. అంతేకాదు యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ వారికి గట్టి పోటీ ఇస్తున్నాడు. హీరోగా రాజకీయాల్లో వెళ్లకముందే తెలుగులో చిరంజీవి ఎక్కువ కమర్షియల్ యాడ్స్ లో నటించారు. అప్పట్లో థమ్స్ అప్, నవరతన్ ఆయిల్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. రీ ఎంట్రీ తర్వాత కమర్షియల్ యాడ్స్ విషయంలో జోరు తగ్గించారు. కానీ  తాజాగా కంట్రీ డిలైట్ పాలకు సంబంధించిన యాడ్ లో చిరు నటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ యాడ్ ను విడుదల చేశారు.  హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ కమర్షియల్ యాడ్ ను చిరు ‘అన్నయ్య’ సినిమా తరహాలో తెరకెక్కించి నవ్వులు పూయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ కమర్షియల్ యాడ్ కోసం  క్లాస్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అలరించారు. 70 యేళ్లకు దగ్గర పడుతున్న తనలో ఫైర్ ఏ మాత్రం తగ్గలేదని ఈ యాడ్ తో మరోసారి ప్రూవ్ చేసారు  చిరంజీవి.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా చాలా యేళ్ల తర్వాత చిరంజీవి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించడం చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.




చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత చిరు యాక్ట్ చేస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు, ఎస్పీ పరశురామ్ తర్వాత చిరు సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.