Chiranjeevi Old Video Viral: గరికపాటిది తప్పయితే మెగాస్టార్ ది కూడా తప్పేగా.. చిరు పాత వీడియో వైరల్!
Chiranjeevi Old Video Viral amid Garikapati Narasimharao Controversy: మెగాస్టార్ చిరంజీవి మీద గరికపాటి కామెంట్స్ వివాదం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు చిరంజీవి పాత వీడియో ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Old Video Viral amid Garikapati Narasimharao Controversy: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే ఆ విషయం పక్కనపెట్టి మెగాస్టార్ అభిమానులందరూ గరికపాటి నరసింహారావు మీద ఫైర్ అయ్యే పనిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన అలయ్ భలయ్ అనే కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారందరూ మెగాస్టార్ చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటే తన ప్రసంగాన్ని ఎవరూ వినడం లేదు అనే బాధతో గరికపాటి నరసింహారావు ఆ అభిమానులను ఏమీ అనకుండా మెగాస్టార్ చిరంజీవిరితో మీరు ఈ ఫోటో సెషన్ ఆపితే నేను ప్రవచనం మొదలు పెడతాను లేకపోతే మైకు వదిలేసి వెళ్ళిపోతాను అందులో నాకు ఎలాంటి మొహమాటం లేదంటూ కామెంట్ చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పటికప్పుడు ఫోటో సెషన్ నిలిపివేసి వెంటనే పక్కన కూర్చోవడమే కాక ఆయనను తన ఇంటికి కూడా ఆహ్వానిస్తూ ఆయనకు పెద్ద అభిమానిని అన్తప్ స్టేజి మీద అందరి ముందు ఒప్పుకోవడమే కాక చాలా గౌరవించే రీతిలో మాట్లాడారు.
అయితే ఇక్కడితో అసలు వివాదం ఏర్పడేదే కాదు కానీ కొద్దిసేపటికి నాగబాబు ఎవరికైనా మా అన్నయ్య లాంటి వారిని చూస్తే అసూయ కలుగుతుంది అంటూ ట్వీట్ చేయడంతో అసలు వివాదం మొదలైంది. మెగాస్టార్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే సినీ నటులు, సినీ టెక్నీషియన్లు అందరూ వరుస పెట్టి గరికపాటిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత గరికపాటి క్షమాపణలు కూడా చెప్పినా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ ఈవెంట్ అంతా గరికపాటిని టార్గెట్ చేస్తూనే సాగింది. అసలు నిజానికి గరికిపాటిది కానీ మెగాస్టార్ చిరంజీవిది కానీ ఇద్దరిదీ తప్పులేదు. గరికపాటి కాస్త కటవుగా కాకుండా సాధారణ రీతిలో చెప్పి ఉంటే ఇంత వివాదం అయ్యేది కాదు.
అయితే ఒక్కోసారి పరిస్థితులు చికాకు పెడుతున్న సమయంలో కోల్పోతామని కొందరు అంటున్నారు. అందుకు ఉదాహరణగా మెగాస్టార్ చిరంజీవి గతంలో ఇలాగే ఒక ప్రెస్ మీట్ లో విసుక్కున్న వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మహానటి సినిమా విడుదల సందర్భంగా అశ్విని దత్ తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా సినిమాని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉండగా ఎవరో తన ముందు మాట్లాడుతుండగా దాన్ని మెగాస్టార్ చిరంజీవి డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు.
వెంటనే ఏమయ్యా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావ్ అని కాస్త ఘాటుగానే అనేసి ఆయన సైలెంట్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి తన చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పేశారు. అక్కడ కూడా మెగాస్టార్ తప్పేమీ లేదు. మరి ఇప్పుడు గరికపాటిది తప్పంటున్న మెగాస్టార్ ఫ్యాన్స్ మెగాస్టార్ ని కూడా తప్పు పడతారా అంటూ గరికపాటిని అభిమానించే కొంతమంది ఈ పాత వీడియోను తెరమీదకు తీసుకొస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు మెగా అభిమానులు సమాధానం చెబుతారా?
Also Read: Old lady on Jr NTR: నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? ఎన్టీఆర్ పై వృద్ధురాలు షాకింగ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook