Unstoppable Season 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ​సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. వేటగాడిలా బాలయ్య అదుర్స్!

Unstoppable with NBK Season 2 Trailer: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ​సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 9, 2022, 02:45 PM IST
Unstoppable Season 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ​సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. వేటగాడిలా బాలయ్య అదుర్స్!

Unstoppable with NBK Season 2 Trailer: నందమూరి బాలకృష్ణ గత ఏడాది రెండు సూపర్ హిట్లు అందుకున్నారు. బోయపాటి డైరెక్షన్లో ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన డిసెంబర్ నెలలో ఆ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. అదే విధంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఒక టాక్ షో ఆహా వీడియో వేదికగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటి సీజన్లో నందమూరి బాలకృష్ణ 10 ఎపిసోడ్లు చేశారు.

పది ఎపిసోడ్లకి మంచి టాక్ రావడమే కాక షో మొత్తాన్ని ఇండియా మొత్తంలోనే టాప్ షో గా నిలబెట్టగలిగింది. ఇక ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సెకండ్ సీజన్ కూడా ప్రారంభిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ కూడా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్  విజయవాడలో నిర్వహించారు. ఇక తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ ట్రైలర్ లో నందమూరి బాలకృష్ణ ఒక నిధి కోసం వెళుతున్న వేటగాడిలా కనిపిస్తున్నారు.

Unstoppable with NBK Season 2 Trailer to Stream From October 14: ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రకారం ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో ఎవరు ముఖ్యఅతిథిగా హాజరుగా అవుతున్నారనే విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడుతో నందమూరి బాలకృష్ణ మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. ఇక ఇదే ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా కనిపించబోతున్నారు.

ఇప్పటికే షూట్ పూర్తి కాగా ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తాజా సమాచారం మేరకు ఈరోజు ఈ సీజన్ కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్లో ఈ షూట్ జరుగుతోంది. ఈ రెండవ ఎపిసోడ్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ హాజరు కాబోతున్నారు. ముందు సిద్దు జొన్నలుగడ్డతో మాట్లాడుతుండగా మధ్యలో విశ్వక్సేన్ ను తెర మీదకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News