Surekha Konidela : సురేఖను చూశా.. ఊ అందామా?.. ఊ ఊ అందామా? అనుకున్నా.. చిరు మాటలకు తలపట్టుకున్న మెగాస్టార్ సతీమణి
Chiranjeevi on Marriage with surekha at Allu Ramalingaiah 100th birth anniversary చిరంజీవికి ఉండే వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టేజ్ ఎక్కితే.. అందరినీ ఉత్తేజ పర్చగలడూ.. అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగలడు. తన స్పీచులతో మెగాస్టార్ అందరినీ మెప్పిస్తుంటాడు.
Chiranjeevi-surekha Konidela : మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి సంగతులను ఇది వరకే ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. చిరు తన పెళ్లి సమయంలో ఎంత బిజీగా ఉన్నాడో.. అసలు పెళ్లి గురించి కూడా ఆలోచించే సమయం లేని టైంలోనే తన పెళ్లి జరిగిపోయిందని చెబుతుంటాడు. అసలేం జరుగుతోందో అని తెలిసే లోపు పెళ్లి అయిపోయిందని చమత్కరిస్తుంటాడు. అయితే ఈ పెళ్లికి ముందే తన మీద రెక్కీ నిర్వహించారని అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య గురించి కూడా చిరంజీవి చెబుతుంటాడు. తాజాగా నాటి సంగతులన్నీ కూడా చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నాడు.
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ అందరినీ నవ్వించేశాడు. తాను మంచి వాడని నిర్దారించుకున్న తరువాతే అల్లు రామలింగయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టుగా చిరంజీవి తెలిపాడు. మంచి వాడిని అవునా? కాదా? అని పలు పరీక్షలు పెట్టి ఉంటాడని చిరంజీవి అన్నాడు. ఆ సమయంలో అవి పరీక్షలే అని తనకు కూడా తెలీదని అన్నాడు. రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య గారు అలా కూర్చుని మందు కొడుతున్నారట. ఆ సమయంలో చిరంజీవిని కూడా ఓ పెగ్గు వేయమని అన్నారట.
కానీ తాను ఆంజనేయుడి భక్తుడిని తనకు అలాంటి అలవాట్లు లేనని చిరు సైలెంట్ అయిపోయాడట. ఆ సమయంలో అల్లు రామలింగయ్య ఓ టిక్ వేసుకుని ఉంటాడు. ఇంకో సందర్భంలో షూటింగ్‌లో అందరూ అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటే.. తాను మాత్రం హార్స్ రైడింగ్‌తో బిజీగా ఉన్నానని, ఆ సమయంలోనూ ఇంకో టిక్ వేసుకుని ఉంటారని ఇలా చిరు తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్లాడు.
అయితే అన్నీ ఓకే అనుకున్నాకే పెళ్లి గురించి తన వద్ద ప్రస్థావించారని, కానీ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేనట్టుగా చిరు చెప్పుకొచ్చాడు. కానీ చిరు తల్లిదండ్రులను ఒప్పించేశారని, దాంతో తాను పెళ్లి చూపులకు వెళ్లాల్సి వచ్చిందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి ఇప్పుడు చేసుకోలేను అని చెబుదామన్నట్టుగా అక్కడికి వెళ్లాడట.
కానీ ఒక్కసారిగా సురేఖను చూసి చల్లబడిపోయినట్టుగా చిరు తెలిపాడు. కెరీర్ ముఖ్యమని అనుకున్నా.. కానీ సురేఖను చూశాకా.. ఊ అందామా? ఊ ఊ అందామా? అని అనుకున్నా.. కాఫీ కలిపి ఇచ్చింది.. అందులో ఏం వేసిందో గానీ.. వెంటనే ఓకే చెప్పేశా.. రెండు నెలల్లోనే పెళ్లి జరిగిందటూ చిరు చెప్పుకొచ్చాడు. ఇక చిరు ఇలా చెబుతుంటే.. సురేఖను తలపట్టేసుకుని ముసిముసి నవ్వులు నవ్వేసింది. అల్లు అర్జున్ అయితే పగలబడి నవ్వేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read : ఆయన నేను ఎందుకూ పనికిరాననుకున్నారు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్
Also Read : వ్యభిచార గృహంలో రెండు వారాలున్నా.. మృణాల్ ఠాకూర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి