Sita Ramam-Mrunal Thakur : సీతారామం సినిమా ఈ మధ్య కాలంలో అందరినీ మెప్పించింది. ఏ చిన్న మచ్చ లేని చిత్రంగా సీతారామం నిలిచింది. ఇక కొందరు మాత్రం ఈ దశాబ్దానికే ఉత్తమ చిత్రంగా అభివర్ణించేశారు. సీతారామం సినిమా ఓ కల్ట్ క్లాసిక్ అని ఆకాశానికెత్తేశారు ఇంకొందరు. అలా అన్ని వైపుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. మరీ ముఖ్యంగా లీడ్ పెయిర్‌గా కనిపించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ జంట చూడముచ్చటగా ఉందని అందరూ కొనియాడారు. నిజంగానే సీతారాములా? అన్నట్టుగా మెప్పించేశారు.
దుల్కర్, మృణాల్ ఇద్దరి నటనలో నిజాయితీ కనిపిస్తుంది.. కళ్లలోనే భావాలను చూపించేశారు. చాలా రోజుల తరువాత ఫ్యామిలీ అంతా కూడా హాయిగా థియేటర్లో కూర్చుని చూసిన సినిమాగా సీతారామం నిల్చింది. స్లోగా మొదలైన కలెక్షన్లు.. చివరకు బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకెళ్లాయి. మొదటి రోజు మొదటి ఆటతోనే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఇక మృణాల్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.
మృణాల్ ఉత్తరాది భామే అయినా.. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కుంకుమ భాగ్య అనే సీరియల్లో మృణాల్ అందరినీ మెప్పించింది. అయితే అసలు మృణాల్ కష్టాలు వింటే మాత్రం.. నిజంగా సీత కష్టాల్లానే అనిపిస్తాయి. చిన్న తనం నుంచి ఎక్కడా కుదురుగా ఉండలేదట. తండ్రి ఉద్యోగరిత్యా ప్రతీ ఏడాది బదిలీ అవుతుండేదట. అలా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదట.
డెంటిస్ట్ అవుదామనుకున్న మృణాల్ చివరకు మీడియాలోకి వద్దామని రెడీ అయిందట. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఓసారి తన తండ్రికి ౩ ఇడియట్ సినిమా చూపించిందట. అందుకే ఇష్టమైన పని చేయ్ అని తనకు ఫ్రీడం ఇచ్చారట. అయితే మీడియా రంగం తనకు సెట్ అవ్వద్దని అనుకుని.. చివరకు సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయిందట. స్నేహితుల సలహా మేరకు మొదట్లో మోడలింగ్ చేసిందట. అయితే ఆ సమయంలో ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్లిందట. లోకల్ ట్రైన్‌లో అలా వెళ్తున్నప్పుడు రైల్లోంచి దూకేయాలనే ఆలోచనలు కూడా వచ్చేవట. కానీ అలా చనిపోతే.. అమ్మానాన్నలకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిందట.
ఓసారి మోడలింగ్ చేస్తుండగా.. ఓ డైరెక్టర్ చూసి సీరియల్ అవకాశం ఇచ్చాడట. ఆ తరువాత మెల్లిగా సినిమాల్లోనూ ప్రయత్నించిందట. కానీ సీరియల్లో నటించావ్ అంటూ చిన్న చూపు చూశారట.. నీకు ఇక్కడ అవకాశాలు దొరకవు.. హీరోయిన్‌లా ఉన్నావా? అసలు అంటూ ఇలా నానా రకాలుగా అవమానించేవారట. సుల్తాన్ సినిమా కోసం ముందుగా తననే సంప్రదించారట. మల్లయుద్దంలో కూడా శిక్షణ తీసుకుందట. కానీ చివరకు అనుష్కకు ఆ పాత్ర వెళ్లిందట.
ఆ తరువాత లవ్ సోనియా సినిమాలో చాన్స్ వచ్చిందట. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార వృత్తి నేపథ్యంలో సినిమా ఉంటుందని..ఓ రెండు వారాల పాటు కలకత్తాలోని వ్యభిచార గృహంలో ఉన్నానని మృణాల్ తెలిపింది. వారి బాధలు, కష్టాలు విని చలించిపోయిందట. మొదటి రోజు షూటింగ్ స్పాట్‌లో డైలాగ్ చెప్పలేకపోయిందట. ఆ డైలాగ్స్ చెబుతుంటే.. అమ్మాయిల వ్యథ, బాధలు గుర్తుకు వచ్చాయట. మొత్తానికి ఆ రోజు సింగిల్ టేక్‌లోనే డైలాగ్ చెప్పడంతో అందరూ ప్రశంసించారట. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయట.
ఆ తరువాత ఓసారి మెల్ బోర్న్‌లో లవ్ సోనియా ప్రదర్శన కోసం వెళ్లినప్పుడు నాగ్ అశ్విన్ కలిశారు. అదే నా జీవితంలో పెద్ద మలుపు అవుతుందని అప్పుడు అనుకోలేదని మృణాల్ చెప్పుకొచ్చింది. ఆ తరువాత జెర్సీ షూటింగ్‌లో ఉన్న సమయంలో హను రాఘవపూడి ఫోన్ చేశారట. కథ చెప్పాలని ఆయన అనడంతో.. రమ్మని చెప్పేసిందట. అలా కాఫీ షాపులో సీత పాత్ర, సీతారామం కథను వినిపించాడట. అలా సీతారామంలోకి సీత వచ్చేసింది.
Also Read : నష్టాలను మిగిల్చింది.. పుష్పపై డైరెక్టర్ తేజ కామెంట్స్
Also Read : ఆవారా జిందగీ అంటోన్న బిగ్ బాస్ శ్రీహాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి