Chiranjeevi prepares KFC chicken: చిరంజీవి లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏ చిన్న ప్రత్యేక సందర్భం వచ్చినా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఓసారి చిరంజీవి వాళ్ల అమ్మ ( Chiranjeevi's mother ) చిన్నప్పుడు చేసిపెట్టిన వంటకం చేసి వాళ్ల అమ్మకు రుచి చూపించారు. తాజాగా మనువరాళ్లతో ( Chiranjeevi's grand daughters ) కలిసి కేఎఫ్‌సి చికెన్ తయారుచేశారు. ఈ వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి కూతుర్ల పిల్లలైన సంహిత, నివ్రితితో బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని చిరు అడగగా అందులో ఒకరు కేఎఫ్‌సి చికెన్ ( KFC chicken ) కావాలి అని బదులివ్వడం మనం వీడియోలో చూడొచ్చు. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) టైంలో బయటినుండి తెచ్చుకోవడం మంచిదికాదు అని మీరు హెల్ప్ చేస్తే ఇంట్లోనే చేసుకుందాం అని అంటారు చిరు. అందుకు వాళ్లు సరే అనగా మనుమరాళ్లను అసిస్టెంట్స్‌గా పెట్టుకొని కేఎఫ్‌సి చికెన్ టైప్ రెసిపితో ( KFC Chicken recipe ) కేఎఫ్‌సి టైప్ ఫ్రైడ్ చికెన్ తయారు చేశారు.  ఎలా ప్రిపేర్ చేసారో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.

చిరు వాళ్ల మనుమరాళ్లను 'మీరు బాగా ఎక్స్‌పర్ట్స్ అయిపోయారు రోడ్డు మీద బండి పెట్టుకొని కేఎఫ్‌సి.. కేఎఫ్‌స్ చికెన్ అని అమ్మేయొచ్చు' అని సరదాగా ఆట పట్టించారు. అలా మొత్తానికి చిరంజీవి తన మనువరాళ్ల కోసం వారితోనే కలిసి కేఎఫ్‌సి చికెన్ ప్రిపేర్ చేశారు.