Waltair Veerayya Censor Review వాల్తేరు వీరయ్య సినిమా కోసం చిరంజీవి బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. మంచులో స్టెప్పులు,ఎండలో ఫైట్స్ అంటూ చిరంజీవి ఈ వయసులో బాగానే కష్టపడుతున్నాడు. అయితే వాల్తేరు వీరయ్య సినిమా కోసం బాబీ చేసిన మ్యాజిక్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని తెలుస్తోంది. రవితేజ, చిరంజీవి మధ్య సీన్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. తాజాగా సెన్సార్ టీం నుంచి వాల్తేరు వీరయ్య రివ్యూ వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి ఫుల్ ఖుష్ అయినట్టు తెలుస్తోంది. ప్రథమార్థం మొత్తం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ మోడ్‌లో ఉంటుందట. రొటీన్‌గానే ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చిరంజీవి చెప్పినట్టుగానే ఉందట. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అద్భుతంగా ఉందట. ఇక నలభై నిమిషాల పాటుగా రవితేజ పాత్ర నిడివి ఉంటుందట.


చిరంజీవి, రవితేజ సీన్లకు పూనకాలు లోడింగ్ అవుతాయట. ఇక రెండు పాటల పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నాయట. రొటీన్ సినిమాయే అయినా కూడా ఎంటర్టైన్ చేస్తుందట, సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు. రవితేజ పాత్ర జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందట. వారి మాటలు వింటుంటే.. సినిమా హిట్టే అని అర్థమవుతోంది.


అయితే జనాలు ఇచ్చే రిజల్ట్ మీద సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి జనాలు ఈ సినిమాను చూసి ఎలాంటి రివ్యూలు ఇస్తారో.. కలెక్షన్లు ఎలా వస్తాయో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి