Chiranjeevi Roja : అది నీ విజ్ఞత.. అలాంటి వాళ్లని పట్టించుకోను.. రోజాపై చిరు సెటైర్లు
Chiranjeevi Satires on Minister Roja చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మంత్రి రోజా రీసెంట్‌గా చేసిన కామెంట్ల మీద చిరు తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. ఎంతో సుతిమెత్తంగా స్పందిస్తూనే తన స్థాయిని పెంచుకున్నాడు.
Chiranjeevi Satires on Minister Roja చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాడు. మీడియాతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రీసెంట్‌గా రోజా చేసిన కామెంట్ల మీద పరోక్షంగా స్పందించాడు. మెగా ఫ్యామిలీలో ఇంత వరకు ఏ ఒక్కరూ ఏ ఒక్కరికీ సాయం చేయలేదని, అందుకే ముగ్గురు అన్నదమ్ములను జనాలు ఓడించారంటూ రోజా కౌంటర్లు వేసింది. తాజాగా వీటిపై చిరు పరోక్షంగా స్పందించాడు.
నా పేరు వాడకపోతే వారి మాటలు ఎవ్వరూ వేయరు.. తనకు గుర్తింపు రాదు.. తనకో గుర్తింపు కావాలి.. అడ్డదారిలో గుర్తింపు కావాలంటే.. అడ్డదిడ్డంగా నా మీద నా ఫ్యామిలీ మీద మాట్లాడాలి.. ఆ రకంగా కూడా గుర్తింపు కావాలంటే.. ఇచ్చేయాలనిపిస్తుంది.. ఆ స్థితిలో నేను ఉన్నాను..నాతో ఉండి.. ఇండస్ట్రీలో నా స్నేహితులుగా ఉన్న వారు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే.. అరే.. నిన్న కాక మొన్నే కదా మా ఇంటికి వచ్చారు.. నేను ఇంత వరకు ఎవ్వరికీ సాయం చేయలేదా? నేను ఎవ్వరికీ సాయం చేయలేదని నిరూపించమనండి..
నేను ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు.. నేను ఎవ్వరికీ సాయం చేయలేదంటే.. నీకు అంతే తెలుసని అనుకుంటాను.. నేను సాయం చేశానని నాకు తెలుసు.. లబ్దిదారులకు తెలుసు.. మధ్యలో నీకు తెలిసే అన్నావో.. తెలియక అన్నావో..అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అలాంటి వాళ్లను నేను పట్టించుకోను.. ఎందుకంటే ఇప్పుడు నా సమయం విలువైంది.. నా మనశ్శాంతి, మానసిక ప్రశాంతత విలువైంది. వాళ్లు అన్నారని నా మనశ్శాంతిని వదులుకోవాలని అనుకోవడం లేదు.. నువ్వేదో మాట అన్నావని నేను ఎందుకు బాధపడాలి అంటూ ఇలా చిరంజీవి ఎంతో సుతి మెత్తగా చురకలు అంటించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి