Chiranjeevi-Shruti Haasan : శ్రుతి హాసన్‌తో మళ్లీ మళ్లీ చేస్తాడట!.. ఏ మాత్రం ద్వేషం పెట్టుకోని చిరంజీవి

Chiranjeevi in Waltair Veerayya Promotions చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఎన్నో అంశాల మీద స్పందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 12:16 PM IST
  • జనవరి 13న రాబోతోన్న చిరంజీవి
  • వాల్తేరు వీరయ్యతో బరిలోకి చిరు
  • శ్రుతి హాసన్‌పై చిరు కామెంట్స్
Chiranjeevi-Shruti Haasan : శ్రుతి హాసన్‌తో మళ్లీ మళ్లీ చేస్తాడట!.. ఏ మాత్రం ద్వేషం పెట్టుకోని చిరంజీవి

Chiranjeevi in Waltair Veerayya Promotions చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా కోసం మీడియా ముందుకు వచ్చాడు. జనవరి 13న రాబోతోన్న వాల్తేరు వీరయ్య కోసం ఇలా చిరంజీవి మీడియాతో ముచ్చటించాడు. ఇక ఈ క్రమంలో చిరంజీవి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద కూడా స్పందించాడు. బాలయ్యతో కలిసి ఈవెంట్ చేయడంపైనా స్పందించాడు. శ్రుతి హాసన్‌ మీద కూడా ఎలాంటి కోపం గానీ ద్వేషం గానీ పెట్టుకోలేదని అర్థమైంది.

శ్రుతి హాసన్‌ గురించి చిరంజీవి చెబుతూ.. ఆమె నా ఫ్రెండ్ కమల్ హాసన్ కూతురు..ఆమె బ్లడ్, డీఎన్‌ఏలోనే డ్యాన్స్ ఉంది.. ఆమె నాకు పోటీగా డ్యాన్స్ చేసింది. కానీ మంచులో డ్యాన్స్ వేయడమే కాస్త కష్టంగా అనిపించింది.. ఆమె చాలా కష్టపడింది. ఆమె అద్భుతంగా నటించింది.. ఆమెతో మళ్లీ మళ్లీ నటిస్తాను.. మళ్లీ నటించాలని ఉంది అంటూ శ్రుతి హాసన్ మీద ఎలాంటి రాగద్వేషాలు చూపించలేదు చిరంజీవి.

వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు శ్రుతి హాసన్ చివరి క్షణంలో మొండి చేయి చూపించింది. ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఈవెంట్‌కు రాలేదు. ఇదే విషయాన్ని స్టేజ్ మీద చిరంజీవి చెబుతూ చురకలు అంటించాడు. ఒంగోలు ఏం తిందో.. ఎవరు బెదిరించారో.. కానీ ఆమె ఇక్కడకు రాలేదు.. ఆరోగ్యం బాగా లేదంట.. అని స్టేజ్ మీద చిరు సెటైర్లు వేశాడు.

కానీ శ్రుతి హాసన్ మీద చిరంజీవి ఎలాంటి కోపం గానీ ద్వేషం గానీ పెట్టుకోలేదని తాజా కామెంట్లు నిరూపించాయి. ఇక బాలయ్యతో కలిసి షో చేయడం అనేది ఇప్పుడే చెప్పలేమని, భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని, తామిద్దరం కలిసి సక్సెస్ మీట్లో కలవాలని అన్నా కూడా అది మైత్రీ వల్లే సాధ్యం అవుతుందని చిరు అన్నాడు.

అతి మంచితనం ఎందుకు అనే ప్రశ్నకు చిరు చక్కని సమాధానం ఇచ్చాడు. ఎవరో ఏదో అన్నారని, మనం కూడా రెచ్చిపోయి పది మాటలు అంటే.. మన ఇగో శాటిస్‌పై అవుతుందేమో గానీ.. దాని వల్ల మన పక్కన ఉన్న వారికి నష్టం కలుగుతుంది.. పర్యవసనాలు ఏంటి? అని ఆలోచించి మాట్లాడాలి.. పక్క వారి క్షేమం కోసం ఇలా అతి మంచితనంగా ఉన్నా తప్పేమీ కాదన్నట్టుగా చెప్పుకొచ్చాడు చిరంజీవి.

Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్

Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News