Golden Globe to Naatu Naatu : నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఉబ్బితబ్బిబ్బైన చిరు.. చిన్నపిల్లాడిలా రాజమౌళి

Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకటించగానే రాజమౌళి చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 08:09 AM IST
  • అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సందడి
  • నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
  • చిరంజీవి, రాజమౌళి రియాక్షన్లు ఇవే
Golden Globe to Naatu Naatu : నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఉబ్బితబ్బిబ్బైన చిరు.. చిన్నపిల్లాడిలా రాజమౌళి

Golden Globe to Naatu Naatu  అంతర్జాయతీ స్థాయిలో చలన చిత్ర విభాగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అయితే.. ఆ తరువాత స్థానంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులుంటాయి. అలాంటి ఉన్నతమైన అవార్డు ఇప్పుడు మన ఇండియన్ సినిమా.. మన తెలుగు సినిమాకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును ప్రకటిచండంతో రాజమౌళి చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేశాడు. అయితే చిరంజీవి మాత్రం సంతోషంతో ఉబ్బితబ్బిబైనట్టు కనిపిస్తోంది. ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 

 

ఇదో గొప్ప చరిత్ర.. ఎప్పటికీ నిలిచిపోతుంది.. బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం అద్భుతం.. మీకు శతకోటి వందనాలు.. ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళికి కంగ్రాట్స్.. ఇప్పుడు ఇండియా ఎంతో గర్వపడుతూ ఉంటుంది అని చిరంజీవి ట్వీట్ వేశాడు.

 

 

ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి కంగ్రాట్స్.. రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ అని ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ వేశాడు.

 

 

అవార్డు ప్రకటించిన తరువాత కీరవాణి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ మీద కంటతడి పెట్టుకున్న కీరవాణి.. ఈ క్రెడిట్ అంతా కూడా తన దర్శకుడు రాజమౌళికి ఇచ్చాడు. తన వల్లే, తన విజన్ వల్లే ఇదంతా సాధ్యమైందని కీరవాణి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే కీరవాణి మాత్రం ఈ సందర్భంగా తన కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ, రాసిన చంద్రబోస్‌ ఇలా అందరినీ గుర్తు చేసుకున్నాడు. అందరికీ థాంక్స్ అన్నాడు.

Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్

Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News