Megastar Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉండాలని..కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ స్పందించారు. సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకిష్టం లేదని చిరంజీవి (Megastar Chiranjeevi) స్పష్టం చేశారు. సినీ కార్మికుల హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry) పెద్దగా చిరంజీవి ఉండాలని సినీ కార్మికులు కోరారు. దీనిపై చిరంజీవి స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. ఆ పదవి నాకస్సలు వద్దు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మధ్య వివాదం జరిగితే.. ఆ గొడవలు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా వారి కోసం నిలబడతా'' అంటూ చిరు వ్యాఖ్యలు చేశారు.


Also Read: Saana Kastam Song Promo: 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో.. మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు


'ఆచార్య' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి.. గాడ్​ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలోనూ సినిమా షూటింగ్​ల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్​ల్లో పాల్గొనాలని చిరంజీవి సూచించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి