Chiranjeevi: విశ్వంభరలో చిరంజీవి ద్విపాత్రాభినయం.. ఇదే ప్రూఫ్!
Vishwambhara Movie Latest Updates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార సినిమాతో దర్శకుడిగా మారిన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
Vishwambhara Movie Latest Updates: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాతో కొత్త డైరెక్టర్ అయిన మల్లిడి వశిష్ఠ టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్నారు. మొదటి సినిమాతోనే ఆదరణ అందుకున్న మల్లిడి వశిష్ఠ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. విశ్వంభర అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఒక సోషల్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. దాదాపు 70 శాతం సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవితో పాటు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష కూడా ఈ మధ్యనే సెట్స్ లో చేరారు.
అయితే తాజాగా ఈ సినిమా కోసం కవల పిల్లలు కావాలి అంటూ చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ కాల్ ను ప్రకటించారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు మగ పిల్లలు కావాలి అని..ఆసక్తి ఉన్నవారు uvcasting14@gmail.com కి మెయిల్ చేయడం లేదా +91-8977090354 నెంబర్ కి వాట్సాప్ చేయమని యువి క్రియేషన్స్ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ చూసిన దగ్గర చిరంజీవి ఈ సినిమాలోని ద్విపాత్రాభినయం చేయబోతున్నారని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి కవల పిల్లల లాగా రెండు విభిన్న పాత్రలు చేయబోతున్నారని అందుకే ఆ పాత్రల చిన్నప్పటి పాత్రల కోసం చిత్ర నిర్మాతలు కవల పిల్లలను వెతుకుతున్నారని కొందరు నటిజన్లు నిర్ధారిస్తున్నారు.
మరోపక్క మల్టీయూనివర్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం ఏకంగా 13 సెట్లను నిర్మించిందట. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook