Chiranjeevi Latest tweet on Ram Charan: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ అని తెలుగులో ఒక మంచి పద్యం ఉంటుంది. ఇప్పుడు ఆ పద్యం చిరంజీవికి కరెక్ట్ గా సూటవుతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సందర్భాలలో ప్రస్తావిస్తూ వచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడిగా భావించే జేమ్స్ కామరూన్ రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లను విన్న తర్వాత చిరంజీవి ఒక్క క్షణం కూడా తన ఆనందాన్ని ఆపుకోలేక వెంటనే ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. సదరు ట్వీట్లో ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రామ్ చరణ్ గురించి ప్రశంసిస్తూ కనిపించారు. వెంటనే సదరు వీడియోని షేర్ చేసిన చిరంజీవి సర్ జేమ్స్ కామెరాన్ రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడారు, ఒక గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ లాంటి ఆయన నోటి నుంచి రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి మాటలు వినడం అంటే అది ఆస్కార్ కి ఏమీ తక్కువ కాదు.


ఇది రామ్ చరణ్ కి చాలా గౌరవం అలాగే ఒక తండ్రిగా నేను గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం, మీ దీవెనలు రామ్ చరణ్ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడతాయి అని అర్థం వచ్చేలా ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ టైమింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వీడియో చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి దృష్టికి నిన్నే వచ్చి ఉండవచ్చు కానీ ఆయన షేర్ చేయడంతో ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా దృష్టి కూడా ఈ వీడియో మీద పడింది. అయితే ఈ ట్వీట్ గురించి పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.


కొందరు పుత్రోత్సాహం అంటే ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం రామ్ చరణ్ గురించి ఇంత బాగా ప్రస్తావించారు కానీ ఈ సినిమా దర్శకుడు రాజమౌళి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటి చిరంజీవి గారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో జేమ్స్ కామెరాన్ ప్రస్తావించింది కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి మాత్రమే కాబట్టి ఆయన రామ్ చరణ్ ను పొగుడుతూ, తన పుత్రోత్సాహాన్ని బయట పెడుతూ ట్వీట్  చేసి ఉండవచ్చు. ఇందులో రాజమౌళిని తీసుకు రావాల్సిన అవసరం ఏముంది చిరంజీవి చెప్పినా చెప్పకపోయినా రాజమౌళి సినిమా చేశాడు అన్న సంగతి అందరికీ తెలుసు కదా. ఇందులో మళ్ళీ రాజమౌళి పేరు తీసుకొచ్చి మరీ ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే చిరంజీవి ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పక తప్పదు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి
Also Read:Shalini Pandey Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన షాలిని పాండే.. మాములు రచ్చ కాదుగా ఇది!


Also Read: Shirley Setia Photos: బీచ్ ఒడ్డున పొట్టి గౌనులో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook