Mega 156 title Revealed: చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నాడు. బింబిసార డైరెక్టర్‌ వశిష్ఠ తెరకెక్కుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ (Vishwabhara) అనే టైటిల్‍ను ఖరారు చేసింది చిత్రయూనిట్. టైటిల్‌ను ప్రకటిస్తూ యూవీ క్రియేషన్స్‌ ఒక వీడియో గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది. ఈ మూవీ మెగాస్టార్ 156వ సినిమా కావడంతో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును 'మెగా 156'గా పిలుస్తూ వచ్చారు. తాజాగా టైటిల్ అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ పుల్ జోష్ లో ఉన్నారు. విశ్వంభర సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు వీడియోలోనే మూవీటీమ్ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైటిల్ వీడియోలో గ్రాఫిక్స్ అద్బుతంగా ఉంది. దేవ లోకంలో స్టార్ గుర్తు ఉండే ఓ క్యాప్సల్ లోకాలను దాటుతూ విశ్వంలో తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అది ఓ గ్రహ శకలాన్ని తగిలి పేలిపోతుంది. అది భూమిపైకి వచ్చి పడుతుంది. అప్పుడు అగ్ని ఎగసిపడుతుంది. ఇందులోనే వెలుగు వచ్చి విశ్వంభర టైటిల్ రివీల్ అవుతుంది. మూడు లోకాల మధ్య సాగే స్టోరీగా తెలుస్తోంది. టైటిల్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ లెవల్లో ఉంటుందోనని మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు.  ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ నటించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 



Also Read: Fighter trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న హృతిక్ 'ఫైటర్' ట్రైలర్‌.. గాల్లో యాక్షన్ అదిరింది..


Also Read: Devara Movie: రిలీజ్ కాక‌ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న 'దేవ‌ర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook