Chiranjeevi Waltair Veerayya Boss Party Song Promo : మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలోకి దిగబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పుడే మొదలుపెట్టేశారు. పుష్ప టైంలోనూ ఇలానే వారానికి ఓ పాట అంటూ రిలీజ్ చేశాడు దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్‌ను రేపు రిలీజ్ చేయబోతోన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈక్రమంలో బాస్ పార్టీ సాంగ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ట్యూన్, లిరిక్స్, ఆ పాటను చూసి జనాలు దేవీ శ్రీ ప్రసాద్‌ను తిడుతున్నారు. ఇదేం ట్యూన్, పాట అంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్‌కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు టైం ఏమీ బాగా లేనట్టుగా ఉంది. మొన్నటి వరకు ఓ పరి సాంగ్ వివాదంతో దేవీ శ్రీ ప్రసాద్ చుట్టూ కాంట్రవర్సీ నడిచింది. ఇప్పుడు ఈ బాస్ పార్టీ సాంగ్‌ ప్రోమో ఇలా ట్రోలింగ్‌కు గురవుతోంది.


ఇక పాటలు కొట్టడం ఆపి రెస్ట్ తీసుకో అని కొందరు ట్రోల్స్ వేస్తున్నారు.. ఇదేం పాటరా అయ్యా అంటూ దారుణంగా తిడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం దేవీ శ్రీ ప్రసాద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మొదట్లో దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అలానే అనిపించినా.. తరువాత అవే ఎక్కేస్తాయ్ అంటూ సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. పుష్ప పాటలను కూడా మొదట్లో బాగా లేవనే అన్నారు.. కానీ ఆ తరువాత అవే ట్రెండ్ అయ్యాయని అంటున్నారు. 


రంజితమే అనే పాట కంటే ఈ పాట వంద రెట్లు నయం అనిపించేలా ఉందంటూ తమన్‌ను కూడా ఆడేసుకుంటున్నారు. మొత్తానికి ఈ బాస్ పార్టీ ప్రోమో అయితే సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఇక రేపు ఈ పాట రిలీజ్ అయ్యాక.. ఇంకెంత ట్రోలింగ్ జరుగుతుందో చూడాలి. లేదా ఆ పాట అందరికీ నచ్చే అవకాశం కూడా ఉండొచ్చు.


Also Read : Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు 


Also Read : Chiranjeevi For IFFI Award : తెలుగు చిత్రసీమకే గర్వకారణం.. చిరుపై మంచు విష్ణు.. మోహన్ బాబు మాత్రం అలా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook