Waltair Veerayya : థియేటర్ల సంఖ్యలో వీరయ్య దూకుడు.. రెండో స్థానంలోకి బాలయ్య.. చిరు మేనియా
Waltair Veerayya Theatre Count సంక్రాంతి రేసులో బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా నిలదొక్కుకున్నారు. అయితే ఇందులో చిరంజీవికి కాస్త అడ్వాంటేజ్ ఉంది. వాల్తేరు వీరయ్యకు కాస్త పాజిటివ్ టాక్ రాగా.. వీర సింహా రెడ్డికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
Waltair Veerayya Theatre Count సంక్రాంతి సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అజిత్ తెగింపు, బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు బరిలోకి దిగాయి. అన్ని సినిమాల టాక్స్, రివ్యూలు వచ్చేశాయి. కాస్త మౌత్ టాక్‌తో వీరయ్యకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్నీ రొటీన్ చిత్రాలే అయినా కూడా వాల్తేరు వీరయ్య కాస్త బెటర్ అనే టాక్ ఎక్కువగా బయటకు వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు పెరిగాయి.
వీర సింహా రెడ్డికి మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లు రావడానికి ఓ కారణం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో వీర సింహా రెడ్డిని వేశారు. దీంతో డే వన్ రికార్డ్‌ను కొట్టేసింది. అయితే మొదటి రోజు వాల్తేరు వీరయ్యకు కాస్త తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో డే వన్ రికార్డులో చిరు వెనకపడ్డాడు. కానీ రెండో రోజున వాల్తేరు వీరయ్యకే థియేటర్లు పెరిగాయి. టాక్ బాగుండటంతో వీరయ్యకే డిస్ట్రిబ్యూటర్లు ఓటేసినట్టు కనిపిస్తోంది.
ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్తేరు వీరయ్య దాదాపు ఆరు వందల థియేటర్లలో ఆడుతోంటే.. వీర సింహా రెడ్డి మాత్రం 450 థియేటర్లలోనే రన్ అవుతోంది. ఇక వారసుడుకి దిల్ రాజు బాగానే థియేటర్లు కేటాయించుకున్నాడు. వారసుడు సినిమాకు ఈ రోజు 385 థియేటర్లు వచ్చాయి. కళ్యాణం కమనీయం సినిమాకు వంద థియేటర్లు దొరికాయి. అజిత్ తెగింపు మాత్రం కేవలం యాభై థియేటర్లలోనే ఆడుతోంది.
అంటే ఇప్పుడు సంక్రాంతి రేసులో వాల్తేరు వీరయ్య ముందున్నాడు. వారసుడు సినిమా కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఆ సినిమాకు కూడా థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. వాటిలో కొన్ని వీరయ్యను ప్రదర్శించే అవకాశాలున్నాయి. అంటే లాంగ్ రన్‌లో మాత్రం వాల్తేరు వీరయ్యకే ఎక్కువ కలెక్షన్లు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి మైత్రీ సంస్థ మాత్రం రెండు సినిమాలతో ఇప్పుడు దుమ్ములేపేస్తోంది.
Also Read: Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్
Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి