Acharya New Release Date: చిరంజీవి ఫ్యాన్స్‌కు శుభవార్త.. `ఆచార్య` విడుదలకు డేట్ ఫిక్స్! రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఉగాది పండగ కానుకగా `ఆచార్య` సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఆదివారం ట్వీట్ చేసింది. 2022 ఏప్రిల్ 1న `ఆచార్య` సినిమాను బిగ్ స్క్రీన్‌లపై విడుదల చేస్తున్నామని పేర్కొంది.
Chiranjeevi's Acharya movie Grand Release on April 1: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా (Acharya Movie) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని శనివారం (జనవరి 15) చిత్ర బృందం ట్వీట్ చేసింది. కరోనా పరిస్థితుల దృష్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొంది. చెప్పినట్టుగానే ఆచార్య చిత్ర బృందం చిరంజీవి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. ఈరోజు ఆచార్య సినిమా విడుదల డేట్‌ను (Acharya New Release Date) ప్రకటించింది.
ఉగాది పండగ కానుకగా 'ఆచార్య' సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఆదివారం (జనవరి 16) ట్వీట్ చేసింది. 2022 ఏప్రిల్ 1న (Acharya On April 1) మెగా మాస్ 'ఆచార్య' సినిమాను బిగ్ స్క్రీన్‌లపై విడుదల చేస్తున్నామని పేర్కొంది. #Acharya Grand Release on April 1, #AcharyaOnApril1 అని హ్యాష్ టాగ్‌లను ట్వీట్ చేసింది. విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రామ్‌చరణ్ జతగా పూజాహెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఆచార్య కచ్చితంగా చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్ బంపర్ హిట్ అయ్యాయి.
Also Read: Telangana : తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవుల పొడగింపు... ఈ నెల 30 వరకు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook