Sourav Ganguly on Virat Kohli: అది వ్యక్తిగత నిర్ణయం.. నాకేం తెలియదు! కోహ్లీ సంచలన నిర్ణయంపై స్పందించిన గంగూలీ!!

టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. అది అతడి వ్యక్తిగత నిర్ణయం అని పేర్కొన్నారు. 

Last Updated : Jan 16, 2022, 10:16 AM IST
  • విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
  • కోహ్లీ సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందన
  • కోహ్లీ నిర్ణయంపై స్పందించిన గంగూలీ
Sourav Ganguly on Virat Kohli: అది వ్యక్తిగత నిర్ణయం.. నాకేం తెలియదు! కోహ్లీ సంచలన నిర్ణయంపై స్పందించిన గంగూలీ!!

Sourav Ganguly responds on Virat Kohli's decision to steps down as India Test captaincy: గత కొన్ని రోజులుగా కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్​గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. శనివారం దానికి కూడా వీడ్కోలు పలికాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు అయింది. కోహ్లీ మూడు నెలల్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకడం పెద్ద సంచలంగా మారింది. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కోహ్లీ స్వయంగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి మాత్రం బీసీసీఐ (BCCI) తప్పించింది. అయితే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ (IND vs SA)​లో ఓటమి అనంతరం జట్టు సభ్యులతో మీటింగ్ పెట్టిన కోహ్లీ.. వాళ్లకు తన కెప్టెన్సీ గురించి చెప్పాడట. ఆ విషయాన్ని బయటకు వెల్లడించొద్దని కూడా కోరాడట.

టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ (India Test Captaincy) నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందిస్తూ.. అది అతడి వ్యక్తిగత నిర్ణయం అని పేర్కొన్నారు. 'విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వేగంగా పురోగతి సాధించింది. కోహ్లీ నిర్ణయం వ్యక్తిగతమైనది. బీసీసీఐ విరాట్ నిర్ణయాన్ని ఎంతో గౌరవిస్తుంది. భవిష్యత్తులో భారత జట్టును మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి అతను ఒక ముఖ్యమైన ఆటగాడు. విరాట్ గొప్ప ప్లేయర్. టీమిండియాకు ఎంతో చేశాడు' అని దాదా ట్వీట్ చేశారు. దాదా ట్వీటుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Also Read: పండగ పూట ప్రాణం తీసిన చైనా మాంజా... బండిపై వెళ్తుండగా అనూహ్య ఘటన

భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్‌ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ (BCCI Tweet) కూడా స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది. 'టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి అభినందనలు. తన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చాడు. భారత జట్టుకు 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి.. 40 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రాణించాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. 

ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, బీసీసీఐ (Kohli vs BCCI) మధ్య గొడవ సద్దుమణగలేదని సమాచారం తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ నుంచి స్వయంగా తప్పుకున్న కోహ్లీని.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ (BCCI) వన్డే కెప్టెన్సీని తొలగించింది. ఆ తర్వాత బీసీసీఐ, సౌరవ్ గంగూలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీ.. గంగూలీ అభిప్రాయాన్ని తప్పుగా పేర్కొన్నాడు. దాంతో అప్పుడు పెద్ద దుమారమే రేగింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. 

Also Read: Virat Kohli - BCCI: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. బీసీసీఐ ఏమందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News