Journey To Ayodhya Poster: చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌ అధినేత వేణు దోనేపూడి కొత్త మూవీని ప్రకటించారు.‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా విశ్వం మూవీని నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్‌లో జర్నీ టు అయోధ్య మూవీ రెండో సినిమా. ఈ చిత్రానికి వీఎన్‌ ఆదిత్య కథను అందిస్తున్నారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా చాలా సినిమాలు రాగా.. ఇప్పుడు అదేబాటలో రామాయణం తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..   


పాన్ ఇండియాలో భారీస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.. భారీ హంగులతో ప్లాన్ చేస్తున్న సినిమాకు నిర్మాణ సారథ్యం తమ్మారెడ్డి భరద్వాజ. వీఎన్‌ ఆదిత్య నేతృత్వంలో ఒక టీమ్ మూవీ లోకేషన్స్‌ కోసం సర్చ్ చేస్తున్నారు. అయోధ్యతోపాటు వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పక్కా ప్లాన్ సిద్ధమైన తరువాత షూటింగ్ మొదలు పెట్టనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ అదిరిపోయింది. అయోధ్య 1117 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించారు. 


ప్రస్తుతం గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో మూవీకి బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వం మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా గోపిచంద్‌తోపాట శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారింది. ఇద్దరు వరుస ఫ్లాప్‌ల్లో ఉండగా.. సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 


Also Read: 4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook