Vikram 62 - Veera Dheera Sooran: డిఫరెంట్ సినిమాలు.. వెరైటీ రోల్స్‌తో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తోన్న నటుల్లో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. ఈయన తన యాక్టింగ్‌ జతీయ ఉత్తమ నటుడిగా ఎదిగారు. ఈ బుధవారం విక్రమ్ బర్త్ డే సందర్బంగా ఆయన హీరోగా నటిస్తోన్న 62వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు 'వీర ధీర శూరన్‌' అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తెలుగులో ఇదే టైటిల్ పెడతారా లేకుంటే వేరే ఏదైనా పెడతారా అనేది చూడాలి.  ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ ఇతర లీడ్ రోల్ల్ యాక్ట్ చేస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


'వీర ధీర శూరన్' టైటిల్ చూస్తుంటే.. అన్న ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ' టైటిల్ గుర్తుకు వస్తుంది. మొత్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ అభిమానులను మెప్పించేలా ఉంది. టీజర్‌ చూస్తే హీరో పేరు కాళి. అతనితో ఓ కిరాణ షాప్ ఉంటుంది. అందులో  కథానాయకుఉడు తన ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌ నడుపుతోన్న వ్యక్తి అని నిర్దారణ అయితే.. అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.  అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ఇట్టే ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే..  హీరో అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో దౌడు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో ఈ సినిమా టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.


225 సెక‌న్ల పాటుండే  ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో కట్ చేసారు. ఇక సినిమాలో హీరోయిజం  ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్‌లో నటించడం కొత్తేమి కాదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆయన మార్క్ స్టైల్. ఈ చిత్రానికి  జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.  తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  ఈ చిత్రంలో చియాన్ విక్రమ్‌తో ఎస్.జే.సూర్య, దుసరా విజయన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది చూడాలి.


ఇదీ చదవండి:  తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook