Choreographer Trinath Rao Passes Away: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ త్రినాథ్‌రావ్ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్ 15) ఉదయం గుండెపోటుతో చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 500 చిత్రాలకు త్రినాథ్‌రావ్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. త్రినాథ్‌రావ్ అంత్యక్రియలు గురువారం (జూన్ 16) చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. త్రినాథ్‌రావ్‌కు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రినాథ్‌రావ్ స్వస్థలం ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. సినిమాలు, నృత్య కళ పట్ల ఆసక్తితో ఆయన కొరియోగ్రాఫర్‌గా మారారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు త్రినాథ్‌రావ్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ హీరో, దర్శకుడు కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'తూరల్ నిన్రు పోచ్చు' కొరియోగ్రాఫర్‌గా త్రినాథ్‌రావ్‌కు తొలి చిత్రం. తమిళ స్టార్ హీరో అజిత్ తొలి సినిమా 'అమరావతి'కి ఆయనే కొరియోగ్రాఫర్. 


తమిళంలో వానత్తై పోల, సెందూర పాండి, నేశం, దావుడి కలవుగల్, తూరల్ నిన్రు పోచ్చు, ముందానై మడిచ్చు తదితర చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కొరియోగ్రాఫర్‌గా మారకముందు సలీం మాస్టర్, వెంపటి చిన్నసత్యం, శేఫు తదితరుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. త్రినాథ్‌రావ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 



Also Read: Horoscope Today June 16th : నేటి రాశి ఫలాలు.. ఈ 6 రాశుల వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు..


Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook