Actress Death: చిత్ర పరిశ్రమలో విషాదం... ఉరేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య...

Bidisha De Majumdar Suicide: బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని బలవన్మరణం చెందింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 04:32 PM IST
  • ప్రముఖ నటి, మోడల్ బిదిషా ఆత్మహత్య
  • కోల్‌కతాలోని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం
  • దర్యాప్తు జరుపుతున్న స్థానిక పోలీసులు
 Actress Death: చిత్ర పరిశ్రమలో విషాదం... ఉరేసుకుని ప్రముఖ నటి ఆత్మహత్య...

Bidisha De Majumdar Suicide: బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, మోడల్ బిదిషా డి మజుందార్ (21) బుధవారం (మే 25) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని డండం ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలలుగా ఆమె అదే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. బిదిషా ఆత్మహత్యపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

బుధవారం సాయంత్రం బిదిషా ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్న పోలీసులు... ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల బిదిషా ఉరేసుకుని కనిపించడంతో మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ఆర్‌జీ ఆసుపత్రికి తరలించారు. బిదిషా ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్‌లో బిదిషా ఏం రాసిందన్నది ఇప్పటికైతే వెల్లడికాలేదు. ఆమె సన్నిహితులు, స్నేహితులు చెబుతున్న ప్రకారం... బిదిషా అనుహబ్ బెరా అనే వ్యక్తితో కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉంది. అతనితో రిలేషన్ కారణంగానే కొన్నాళ్లుగా ఆమె డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం బరాక్‌పూర్ పోలీసులు బిదిషా ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

మోడల్‌గా పాపులర్ అయిన బిదిషా 2021లో అనిర్‌బెద్ ఛటోపాధ్యాయ్ దర్శకత్వంలో వచ్చిన 'బార్-ది క్లౌన్' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటుడు దేవరాజ్ ముఖర్జీ ఇందులో కీలక పాత్రలో నటించారు. బిదిషా ఆత్మహత్యపై పలువురు నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Also Read: Praposal Video: పెళ్లికి ముందు రోజు రాత్రి స్పెషల్ సర్ ప్రైజ్.. ఎవ్వరూ ఊహించలేరు!

Also Read: PM Modi comments: కుటుంబం కోసం రాష్ట్రం ఏర్పాటు కాలేదు..కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఫైర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News