CM Jr Ntr Banners at Ram The warrior event: ఒకపక్క సినీ బ్యాక్ గ్రౌండ్ మరోపక్క రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టాలని అడపాదడపా ఆయన అభిమానులు హల్చల్ చేస్తూ ఉంటారు. తాజాగా రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సీఎం ఎన్టీఆర్ అంటూ ఆయన అభిమానులు  బ్యానర్లు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శుక్రవారం నాడు అనంతపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ లింగస్వామి దర్శకుడు బోయపాటి శ్రీను సినీ నిర్మాత శ్రీనివాస చిట్టూరి వంటి వారు హాజరయ్యారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ ఈవెంట్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అంటూ రాసి ఉన్న ఒక బ్యానర్ చూపించడం ఆసక్తికరంగా మారింది.


నిజానికి నందమూరి కుటుంబానికి రాయలసీమలో అందులోనూ ముఖ్యంగా అనంతపురంలో అభిమానులు ఎక్కువ అనే చెప్పాలి. నందమూరి కుటుంబాన్ని చాలా సంవత్సరాలుగా అనంతపురం రాజకీయంగా కూడా ఆదరిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారన్న సంగతి తెలిసింది. అయితే గతంలో ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావు కానీ ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొన్నిసార్లు డిమాండ్ చేస్తూ వచ్చారు.


ఇప్పుడు ఏకంగా సీఎం ఎన్టీఆర్ అంటూ బ్యానర్ ప్రదర్శించడం అనేది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను ఎప్పటికైనా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే ఏ క్షణానైనా ఎలాంటి బాధ్యతలు తీసుకోవడానికి అయినా సిద్ధమే అని జూనియర్ ఎన్టీఆర్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే నారా లోకేష్ విషయంలో ఇబ్బంది పడక తప్పదని భావించి ఆయనను ప్రస్తుతానికి పక్కన ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ


Also Read: Nani's Dasara Movie : ఇదేదో తేడాగా ఉందే.. కొత్త అనుమానాలు మొదలు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook