Nani's Dasara Movie : ఇదేదో తేడాగా ఉందే.. కొత్త అనుమానాలు మొదలు?

Nani's Dasara Movie : నాని హీరోగా రూపొందుతున్న దసరా అనే సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది..   పోస్టర్లో నాని నిలుచున్న ఫోజ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నిలుచున్న ఫోజుకు దగ్గరగా ఉండడంతో కొత్త చర్చ మొదలైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 01:11 PM IST
Nani's Dasara Movie : ఇదేదో తేడాగా ఉందే.. కొత్త అనుమానాలు మొదలు?

Netigens trolling Nani's Dasara poster: నాని హీరోగా రూపొందిన శ్యాం సింగరాయ్ సినిమా ఒక మాదిరి హిట్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆయన హీరోగా వచ్చిన అంటే సుందరానికి మాత్రం ఆశించిన మేర ఫలితాలు అందుకోలేకపోయింది. దీంతో ఆయన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న దసరా అనే సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

ఈ మేరకు ప్రకటన చేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఆ పోస్టర్ కొత్త చర్చకు దారితీసింది. దానికి కారణం ఏమిటంటే ఈ పోస్టర్లో నాని నిలుచున్న ఫోజ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నిలుచున్న ఫోజుకు దగ్గరగా ఉండడమే. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా అయితే పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపించారో,  నాని కూడా అలాగే మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇది పుష్ప సినిమానా లేక నిజంగా నాని సినిమాయేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

నిజానికి నాని హీరోగా రూపొందుతున్న దసరా సినిమా పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో రూపొందుతోంది. సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలు కూడా షూట్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా గత షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను షూట్ చేశారు. ‘నాటు నాటు’ ఫేమ్‌ ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ లో దాదాపు 500 మంది డాన్సర్లు పాల్గొన్నారు. ఇక తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళం,  హిందీ భాషల్లో కూడా ‘దసరా’ మూవీ రిలీజ్‌ కానుంది. అంటే ఒక రకంగా ఈ సినిమా నానికి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అన్నమాట. సముద్రఖని,  సాయికుమార్,  జరీనా వాహబ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తుండగా సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. 

Also Read: LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

Also Read: Rajamouli : నా స్వార్ధం అదే.. అసలు విషయం బయట పెట్టిన రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News