Vikram's Cobra Movie will streaming on SonyLIV: అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలివుడ్ స్టార్ హీరో 'చియాన్‌' విక్రమ్‌ నటించిన తాజా సినిమా 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్‌ స్టూడీయో ప‌తాకంపై ఎస్ఎస్ ల‌లిత్‌ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. కోబ్రా చిత్రంలో విక్రమ్‌ సరసన కేజీయఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్‌, మృణాళిని రవి, డైరెక్టర్ కెఎస్‌ రవికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన కోబ్రా సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్‌ విభిన్న పాత్రల్లో నటించిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోబ్రా సినిమాని థియేటర్లో చూడలేని వారు ఓటీటీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో కోబ్రా సినిమా గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ఆ వార్తల సారాంశం. తమిళ, తెలుగు భాషలో ప్టెంబ‌ర్ 23 లేదా 30 నుంచి కోబ్రా సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే చిత్ర యూనిట్ లేదా సోని లివ్ ఓ అధికారిక ప్రకటన చేయనున్నారట. 


ఆగస్ట్‌ 31న థియేటర్లో విడుదలైన కోబ్రా సినిమాకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే మొదటి రెండు రోజులు మాత్రం కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. ఈ సినిమాలో విక్రమ్‌ విభిన్న పాత్రల్లో అలరించాడు. ఎప్పటిలాగే చియాన్ నట విశ్వరూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై విక్రమ్‌ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. 


Also Read: సరికొత్తగా ప్రమోషన్స్‌.. రాజకీయాల మాదిరి పాదయాత్ర మొదలెట్టిన హీరో నాగశౌర్య! ఇదే మొదటిసారి 


Also Read: Gold Price Today 14 September: బంగారం ప్రియులకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర! వెండి రేటు మాత్రం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook