twitter fake account: చాలా మంది హీరోలు, హీరోయిన్లకు ఎదురైన సమస్యే ఇప్పుడు కమెడియన్ ఆలీ ( Comedian Ali ) కి కూడా ఎదురైంది. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ట్విటర్‌లో ఫేక్ అకౌంట్‌ను ఏర్పాటు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆలీ శనివారం సైబర్ క్రైం  పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబరాబాద్ (Cyberabad Police) డీసీపీ రోహిణికి ఆయన ఫిర్యాదు పత్రాన్ని అందించారు. Also read: KGF Yash: ఈ రోజు చాలా ప్రత్యేకమైనది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాక్టర్ ఆలీ అఫిషియల్ అనే పేరుతో ట్విటర్ అకౌంట్‌ను రూపొందించి పోస్టులు పెడుతున్నారని వివరించారు. ఆ ట్విటర్ అకౌంట్‌కి ఆరువేల మంది ఫాలోవర్స్ ఉన్నారని, తనకు ఇప్పటివరకు అకౌంట్ లేదని వెల్లడించారు. అయితే ఆ పోస్టులను తానే పెట్టానని భావించి పలువురు కామెంట్స్ చేస్తున్నారని, దీంతోపాటు మీడియా కూడా వార్తలు రాస్తోందని చెప్పారు. వాటిని చూస్తుంటే బాధగా ఉందని అభిప్రాయపడ్డారు. Also read:Nithin Marriage: నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్


ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నానని, తన వల్ల పార్టీకి, సీఎం జగన్‌మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలీ పేర్కొన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఇకపై తనకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా తన బృందం సభ్యులను తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని కోరారు. Also read: TS Secretariat: జీ బ్లాక్ కింద గుప్తనిధులు: రేవంత్ రెడ్డి