DJ Tillu: విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నారా.. హీరో సిద్ధు జొన్నలగడ్డ రియాక్షన్ ఇదే..
DJ Tillu Siddhu on Copying Vijay Deverakonda: డీజే టిల్లు మూవీ విడుదలకు సిద్ధమైంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ మూవీ ప్రమోషన్లలో బిజీగా బిజీగా గడుపుతున్నాడు. సిద్ధు విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నాడంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
DJ Tillu Siddhu on Copying Vijay Deverakonda: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా విమల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. శనివారం (ఫిబ్రవరి 12) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ విడుదలైన సినిమా సాంగ్స్, ప్రోమో, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రెస్ మీట్‌లో జరిగిన కాంట్రవర్సీ కూడా సినిమాపై అటెన్షన్‌ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌ను కాపీ కొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై ఇంటర్వ్యూలో సిద్ధు స్పందించాడు. ఆ కామెంట్స్‌కి తనకేమీ కోపం రావట్లేదని.. పైగా వాటిని కాంప్లిమెంట్స్‌గా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాన్స్, మ్యూజిక్, ప్రెస్ మీట్ కాంట్రవర్సీ ఇవన్నీ సినిమా పట్ల యూత్‌లో అటెన్షన్ క్రియేట్ చేశాయని చెప్పాడు. మొదటి నుంచి తాము ఇదే హైప్ కోసం చూస్తున్నామని చెప్పుకొచ్చాడు. డీజే టిల్లు ప్రోమో, ట్రైలర్‌లలో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్‌ను చూసి విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధు దానిపై స్పందించాడు.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన డీజే టిల్లు కథ ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుందని ఇదివరకే మేకర్స్ వెల్లడించారు. ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు సినిమా క్లైమాక్స్‌లో మంచి సందేశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందంటున్నారు. సినిమా హిట్ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయామని... అయితే ఏ స్థాయి హిట్ అనేదే చూడాలంటున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా రూ.8 కోట్ల పైచిలుకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook